Apr 13 2021 @ 15:27PM

ఎన్టీఆర్ 30 ..హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ ఆమెకేనా..?

ఎన్టీఆర్ 30 ప్రకటన తాజాగా వచ్చిన సంగతి తెలిసిందే. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన మైల్ స్టోన్ మూవీ 30 చేయబోతున్నాడు. వాస్తవంగా ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్‌ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయాల్సింది. ఈ సినిమాను హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లలో ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయింది. ఎన్టీఆర్‌ 30వ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాదు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. ఈ ప్రచారంలో ఎన్టీఆర్‌ 30వ సినిమాకి దర్శకుడు 'జనతా గ్యారేజ్‌' సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన కొరటాల శివ అని వచ్చింది. ఆ విధంగానే కొరటాల శివతో ఎన్టీఆర్‌.. తన 30వ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం (ఏప్రిల్‌ 12) వెలువడింది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తారన్న ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్‌ 30వ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడనుకున్నప్పుడు ఎక్కువగా వినిపించిన స్టార్ హీరోయిన్ పేరు పూజా హెగ్డే. ఆ తర్వాత రష్మిక మందన్న .. జాన్వీ కపూర్ పేరు కూడా ప్రచారంలో నిలిచింది. ఒక దశలో కియారా అద్వానీ పేరు కూడా బాగా వినిపించింది. కాగా ఇప్పుడు ఎన్టీఆర్‌ 30వ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ కియారా అద్వానీనే అంటున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ దర్శకుడు కొరటాల శివతో పని చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కి కొరటాల శివనే పరిచయం చేశాడు. కాబట్టి కొరటాల శివ అడిగితే కియారా డేట్స్ సర్దుబాటు చేయొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమాలో కియారా అద్వానీ ఉంటే బావుంటుందని అభిప్రాయపడుతున్నాడట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎవరు సెలెక్ట్ అవుతారో.