స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి కావాల్సింది.
`ఆర్ఆర్ఆర్` ఆలస్యం, ఆపై లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని మరో రెండు నెలలు వాయిదా వేసినట్టు తాజా సమాచారం. ఎన్టీయార్ జన్మదినోత్సవం సందర్భంగా మే 20న ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందట.