Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగుల ఆందోళన

విజయవాడ: ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. వీసీ ఛాంబర్‌లో బైఠాయించి, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ బాస్ చెప్పినట్లే వింటానన్న వీసీ వ్యాఖ్యలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రేపటి నుంచి జేఏసీ తరపున ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జీవో 25 ద్వారా బ్యాంకుల్లోని ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్లకు రక్షణ లేదని ఉద్యోగులు మండిపడ్డారు. యూనివర్సిటీ నిధులు రూ.448 కోట్లను కష్టపడి కూడేసామని ఉద్యోగులు పేర్కొన్నారు. వీటిలో రూ.400 కోట్లు ప్రభుత్వ కొత్త సంస్థకు ఏకపక్షంగా వీసీ బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement