Abn logo
Feb 27 2021 @ 13:04PM

ఎన్టీయార్ మాస్క్ రేటెంతో తెలుసా?

తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతి విషయానికీ అభిమానులు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. వారి అలవాట్ల గురించి, వాళ్లు వాడే బ్రాండ్స్ గురించి ఆసక్తి చూపుతుంటారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఆ విషయంలో మరికాస్త ఫాస్ట్‌గా ఉన్నారు. ఇప్పటికే ఎన్టీయార్ పెట్టుకునే వాచ్, ధరించే షూస్ గురించిన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియాలో పెట్టేశారు. తాజాగా ఎన్టీయార్ మాస్క్ గురించిన సమాచారాన్ని కూడా వైరల్ చేస్తున్నారు.

 ఇటీవల స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి హాఫ్ శారీ ఫంక్షన్‌కు ఎన్టీయార్ దంపతులు హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఫంక్షన్‌కు వచ్చినపుడు ఎన్టీయార్ ధరించిన మాస్క్ ధర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ యూఎస్ స్పోర్ట్స్ బ్రాండ్‌కు చెందిన ఆ మాస్క్ ధర 2340 రూపాయలట. ఎన్టీయార్ ధరించడంతో ఆ మాస్క్ కొనేందుకు ఆయన అభిమానులు కూడా ప్రయత్నిస్తున్నారట. ఎన్టీయార్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.  

Advertisement
Advertisement
Advertisement