ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-01-19T05:16:02+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం
ఎన్‌టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎన్‌ఎండీ ఫిరోజ్‌, నాయకులు

  1.  టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ 


నంద్యాల, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు. మంగళవారం ఎన్‌టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా శ్రీనివాససెంటర్‌లోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ 9 నెలల్లోనే టీడీపీని స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆయన హయాంలో నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. నంద్యాల పార్లమెంటరీ ప్రాంతం ప్రస్తుతం సాగునీటి జలకళ, సస్యశ్యామలంతో కళకళలాడుతుందంటే ఇందుకు ఎన్‌టీఆర్‌ ప్రధాన కారణమని అన్నారు. ఆనాడు తెలుగుగంగ పథకాన్ని ఎన్‌టీఆర్‌ ప్రారంభించకపోయి ఉం టే, ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఎన్‌ఎండీ ఫిరోజ్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌లీడర్‌ మణియార్‌ ఖలీల్‌, పార్లమెంట్‌ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పిల్లి వెంకటేశ్వర్లు, నాయకులు బోయ గోవింద్‌ నాయుడు, అక్బర్‌ హుసేన్‌, సైలాబ్‌, ఇక్బాల్‌, రవికుమార్‌, నాయక్‌ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, మున్సిపల్‌ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాబువలి, కౌన్సిలర్లు నాగార్జున, జైనాబీ, శ్రీదేవి, నాయకులు కొండారెడ్డి, వినయ్‌కుమార్‌ ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని జిల్లెల్ల శ్రీరాములు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ పార్లమెంట్‌ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్‌, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 


పాణ్యం: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు భారతరత్న ప్రకటించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రమణమూర్తి, ఖాదర్‌బాషా, ఎంపీటీసీ రంగరమేష్‌ మాట్లాడుతూ తెలుగు వారి గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోయే నటుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. అనంతరం ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంమోహన్‌నాయుడు, పుల్లారెడ్డి, సుబ్బయ్య, సుధాకర్‌, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.  


ఆళ్లగడ్డ: ఎన్టీఆర్‌కు ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం ఉందని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి చాంద్‌బాషా, కౌన్సిలర్‌ హుసేన్‌బాషా అన్నారు. పట్టణంలోని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటిలో మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో శేఖర్‌రెడ్డి, యువకులు పాల్గొన్నారు. 


శిరివెళ్ల: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మురళి, యర్రగుంట్ల-2 ఎంపీటీసీ కమతం జయరామిరెడ్డి, కమతం పుల్లారెడ్డి, లక్ష్మిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా యర్రగుంట్ల గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంగళవారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం సుబ్బారెడ్డి, శీలం లక్ష్మీ ప్రసాద్‌, కమతం రాజశేఖర్‌రెడ్డి, జాకీర్‌ హుసేన్‌, మద్దిలేటి, జమాల్‌ బాషా, షఫి, రామ్మోహన్‌, తాళ్లూరి బుగ్గన్న, విజయ్‌ పాల్గొన్నారు. 


చాగలమర్రి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌ అని టీడీపీ మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా, రాష్ట్ర తెలుగునాడు కార్యదర్శి గుత్తి నరసింహులు అన్నారు. మంగళవారం చాగలమర్రిలో టీడీపీ పట్టణ కార్యదర్శి కొలిమి సోను ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొలిమి ఉసేన్‌వలి, కొలిమి షరీఫ్‌, రఫిద్దీన్‌, శ్యాబా, అమీర్‌, మదార్‌సా, బషీర్‌, జెట్టి నాగరాజు, శంకర సుబ్బారావు, అబ్దుల్‌ఖాదర్‌, మాబులాల్‌, కింగ్‌హుసేన్‌, రమేష్‌, నాగూర్‌వలి, చోటు పాల్గొన్నారు. 


ఓర్వకల్లు: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమని టీడీపీ నంద్యాల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి అన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఓర్వకల్లులో ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ 9 నెలల్లోనే టీడీపీని స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆయన హయాంలో నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, ఎల్లయ్య, అల్లబాబు, యాసీన్‌బాషా, అబ్దుల్లా, నాగేంద్ర, వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-01-19T05:16:02+05:30 IST