ఎన్టీఆర్‌ వర్ధంతికి తరలిరావాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-01-18T06:07:03+05:30 IST

తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి న యుగ పురుషుడు నందమూరి తారక రామారావు వర్ధంతికి తరలిరావాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చా రు.

ఎన్టీఆర్‌ వర్ధంతికి తరలిరావాలి: టీడీపీ
కళ్యాణదుర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉమామహేశ్వరనాయుడు

రాయదుర్గం టౌన, జనవరి 17: తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి న యుగ పురుషుడు నందమూరి తారక రామారావు వర్ధంతికి తరలిరావాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చా రు. వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కల్యాణమంటపంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవం తం చేయాలన్నారు. రాజకీయాల్లో పేద వాడికి నిజమైన భాగస్వామ్యం కల్పించి న గొప్ప రాజనీతిజ్ఞుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. అదేవిధంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పట్టణ అధ్యక్షులు పసుపులేటి రా జు మాట్లాడారు. లెజెండరీ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరా రు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వున్న సీతారామాంజనేయస్వామి కల్యాణ మంటపంలో ఉదయం 7 గంటల నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి దాతలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు.  కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి పొరాళ్లు పురుషోత్తమ్‌, పూజారి తిప్ప య్య, మైనార్టీ అధ్యక్షులు కడ్డిపూడి మహబూబ్‌ బాషా, ప్రధాన కార్యదర్శి ఇనాయత బాషా, సిమెంటు శీన, అగ్రహారం కిరణ్‌ కుమార్‌, వల్లి పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకని మంగళవారం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ని యోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, ము రళి, తలారి సత్యప్ప, రామరాజు, శ్రీరాములు, వేలూరి అరవింద్‌ పాల్గొన్నారు. అంతకుముందు ఆయన కుందుర్పి మండలం కృష్ణాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహ స ముదాయ మరమ్మతుల కోసం రూ.10 వేలు విరాళం అందజేశారు. 

  

నందమూరి తారక రామరావు 26వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం కళ్యాణదుర్గంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చే యాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి పిలుపుని చ్చారు. సోమవారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయం వద్ద నాయకులు ఆర్జీ శివశంకర్‌, పాపంపల్లి రామాంజనేయులు, గోళ్ల వెంకటేశులుతో కలిసి విలేకరుల తో మాట్లాడారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి, ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకు లు ఆవుల తిప్పేస్వామి, గాజుల శ్రీరాములు, డీకే రామాంజనేయులు, రాజశేఖర్‌గౌడ్‌, గోవిందరెడ్డి, గురుప్రసాద్‌, రంగప్ప, మునీర్‌, చంద్రప్ప, గోళ్ల రాము, రా మాంజనేయులు, నారాయణస్వామి పాల్గొన్నారు. అంతకుముందు ఆయన   మండలంలోని దురదకుంట గ్రామంలో పార్టీ కార్యకర్త తిమ్మప్ప అనారోగ్యంతో మృతి చెందగా, మృతదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రన్నస్ఫూర్తితో రూ.5వేలు ఆర్థిక సాయం అం దజేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.


Updated Date - 2022-01-18T06:07:03+05:30 IST