మహనీయుడు ఎన్‌టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T05:25:25+05:30 IST

తెలుగువారి కీర్తీని ప్రపంచ దేశాల కు చాటి చెప్పిన మహనీయుడు ఎన్‌టీఆర్‌ అని నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు, భీమవరం నియోజవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మి అన్నారు.

మహనీయుడు ఎన్‌టీఆర్‌
భీమవరంలో దుస్తులు పంపిణీ చేస్తున్న సీతారామలక్ష్మి తదితరులు

ఊరూవాడా ఘనంగా 26వ వర్ధంతి


భీమవరం అర్బన్‌/రూరల్‌, జనవరి 18 : తెలుగువారి కీర్తీని ప్రపంచ దేశాల కు చాటి చెప్పిన మహనీయుడు ఎన్‌టీఆర్‌ అని నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు, భీమవరం నియోజవర్గ ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మి అన్నారు. పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ 26వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు వీరమ్మ పార్కు వద్ద ఎన్‌టీఆర్‌ విగ్రహానికి, పార్టీ కార్యాలయంలో ఎన్‌టీ ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు, ఆసుపత్రి సిబ్బందికి పండ్లు, పాలు , రొట్టెలు పం పిణీ చేశారు. కొత్తపూసలమర్రులో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి మండల టీడీపీ అధ్యక్షులు రేవు వెంకన్న, ప్రధాన కార్యదర్శి కౌరు పృథ్వీశంకర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌, నాయకులు ఎండీ సబీనా, మెరగాని నారాయణమ్మ, మామిడిశెట్టి ప్రసాద్‌, మాదాసు కనకదుర్గ, సయ్యద్‌ నసీమా బేగం, నరహరిశెట్టి రూపవాణి, మండల ఐటీడీపీ అధ్య క్షుడు బొడ్డు మోహన్‌, తెలుగు యువత అధ్యక్షులు కోయలగడ్డ గణపతి, మం డల బీసీ సెల్‌ అధ్యక్షుడు చెన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఆకివీడు/రూరల్‌ : తెలుగుజాతి ఆత్మగౌరవమే ఎన్‌టీఆర్‌ అని మండల, పట్టణ టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్‌, బొల్లా వెంకట్రావు అన్నా రు. శ్రీనగర్‌కాలనీ, వెలంపేట, డైలీ మార్కెట్‌, సంతమార్కెట్‌, సాలిపేటలోని ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద లకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఆకివీడు మండలం దుంపగడప, సిద్ధా పురం, పెదకాపవరం, చినకాపవరం, గుమ్ములూరు గ్రామాల్లో పేదలకు టీడీపీ నాయకులు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.పార్టీ మండల–పట్టణ కార్యదర్శులు నౌ కట్ల రామారావు, గంధం ఉమా, జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మల్‌, కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, మట్టా రామారావు, మట్టా సత్యనారాయణ, ముద్దే కొండ, భూపతిరాజు తిమ్మరాజు పాల్గొన్నారు.


పెనుగొండ : పెనుగొండ గాంఽధీ బొమ్మల సెంటర్‌లో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వృద్ధులు, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు.వడలిలో వితంతువులు, వృద్ధులు, పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ నక్కా శ్యామలా సోని, టీడీపీ నాయకులు గంధం వెంకట్రాజు, కటికిరెడ్డి నానాజీ, నక్కా వేద వ్యాస శాస్త్రి, వేండ్ర రాము, మండ ప్రసాద్‌, వెలిచేటి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.


పాలకోడేరు/ఉండి : ప్రజాహితపాలనకు ఎన్‌టీఆర్‌ ప్రతీక అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. గొల్లలకోడేరు, గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, పాలకోడేరు, మోగల్లు, ఉండి టీడీపీ కార్యాలయం వద్ద,ఆరేడు గ్రామాల్లో ఎన్‌టీఆర్‌ 26వ వర్ధంతిని నిర్వహించారు. పేదలకు పండ్లు, రొట్టెలు, దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అద్యక్షులు దెందుకూరి ఠాగూర్‌కోటేశ్వరరాజు, జుత్తుగ శ్రీనివాసరావు, గాదిరాజు సూర్యనారాయణరాజు, కాజా వీరాస్వామి, సాలా మల్లేశ్వరరావు, మంతెన సాయి లచ్చిరాజు, కందుల రాధా బల రామకృష్ణ, కాగిత మహంకాళి, పొత్తూరి వెంకటేశ్వరరాజు, కరిమెరక శ్రీనివాస రావు, జీవీ.సత్యనారాయణ, పోలుబోతు రాము, కలిగొట్ల ఎంపీటీసీ రుద్దర్రాజు యువరాజు, యశోధకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


వీరవాసరం : వీరవాసరం, చింతలకోటిగరువు, రాయకుదురు, నవుడూరు , మత్స్యపురి గ్రామాల్లో ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో మండలశాఖ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాసరావు , వీరవల్లి శ్రీనివాసరావు, యరకరాజు గోపాలకృష్ణంరాజు, వీరవల్లి చంద్రశేఖర్‌ , కవురు శివకృష్ణ, తమ్మినీడి నాగేశ్వరరావు, చింతా కనకయ్య పాల్గొన్నారు.


పాలకొల్లు టౌన్‌/రూరల్‌ : చిరస్మరణీయుడు ఎన్‌టీ ఆర్‌ అని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ అన్నారు. కెనాల్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దగ్గులూ రు, వడ్లవానిపాలెం, కాపవరం, సగం చెరువు,ఆగర్తిపాలెం, ఆగర్రు , కొత్తపేట, పీఎంపల్లి, వర్ధినం, పూలపల్లి, ఉల్లం పర్రు తదితర గ్రామాల్లో ఎన్‌టిఆర్‌ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.పట్టణ నందమూరి అభిమాన సంఘం గౌర వాధ్యక్షుడు బోనం వెంకట నారా యణ, అధ్యక్షుడు షేక్‌ సిలార్‌, కార్యదర్శి మజ్జి శ్రీను, గూడాల ప్రసాద్‌ పేదలకు పండ్లు పంపిణీ చేశారు.అన్న క్యాంటీన్‌ వద్ద 395వ రోజు ఎన్‌టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని అభిమాని, బీసీ సంఘ నాయకుడు కాగిత సూర్యనారాయణ 300 మందికి భోజనాలు  ఏర్పాటు చేశా రు.కార్యక్రమంలో పెచ్చెట్టి బాబు, కర్నేన రోజారమణి, పీతల శ్రీనివాస్‌, మండల టీడీపీ అధ్యక్షుడు కోడి విజయ భాస్కర్‌, కార్యదర్శి పాముల రజనీ పాల్గొన్నారు.


ఆచంట : ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా ప్రజలకు సేవలందించాలని ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఎన్‌టీఆర్‌ 26వ వర్ధంతిని పురస్కరించుకుని ఆచంట కచేరి సెంటర్‌లో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పండ్లు అందజేశారు. టీడీపీ నాయకుడు బోడపాటి  దుర్గా ప్రసాద్‌ సుమారు 200 మందికి దుప్పట్లు, పండ్లు అందజేశారు.   ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, వైస్‌ ఎంపీపీ తాళం శ్రీనివాస్‌, గొడవర్తి శ్రీరాములు,  కేతా మీరయ్య, గణపతినీడి రాంబాబు, చిర్రా బాలాజీ, తమ్మినీడి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


యలమంచిలి : రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్‌టీఆర్‌ అని మండల టీడీపీ అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి ని పురస్కరించుకుని మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయం, యలమంచిలి ప్రధాన కూడలి, శిరగాలపల్లి, అడవిపాలెం ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో తాళ్లూరి బుజ్జిబాబు, నారిన సత్తిబాబు, బొప్పన హరికిషోర్‌, రుద్రరాజు సత్యనారాయణ రాజు, ఆరుమిల్లి చిన్ని, చిలుకూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం టౌన్‌ : ఎన్‌టీఆర్‌ ఆదర్శనీయుడని శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీష్‌ అన్నారు. స్టీమర్‌రోడ్‌లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. పట్ట ణంలోని రాయపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. తెలుగు యువత ఆధ్వర్యంలో లెప్రసీకాలనీ వాసులకు భోజనాల ప్యాకె ట్లు, ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.సీతారాంపురం, ధర్భరేవు గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేశారు. ఈ కార్యక్ర మంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, జోగి పండు, పద్మ, బండారు పటేల్‌నాయుడు, కొట్టు పండు, చిటికెల రామ్మోహన్‌, అంబటి ప్రకాష్‌, ఆరేటి వేణు, వాతాడి ఉమా, అకన సుబ్రహ్మణ్యం, కోడిపల్లి వాసు, సజ్జ నర్సింహామూర్తి పాల్గొన్నారు.

కాళ్ళ : తెలుగు జాతి కీర్తిని జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి  ఎన్‌టీఆర్‌ అని ఉండి వాటర్‌ డీసీ మాజీ చైర్మన్‌ తోట ఫణిబాబు అన్నారు. కాళ్ళ, పెదఅమిరం, దొడ్డనపూడి తదితర గ్రామాల్లో ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాళ్ళ మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్నప్రసాద్‌, పెదఅమిరం సర్పంచ్‌ డొక్కు సోమేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు జీవీ.నాగేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, గోకరాజు శివరామరాజు, నడింపల్లి విశ్వనాథరాజు, గులిపల్లి జోగయ్య, కొప్పినీడి గణపతి తదితరులు పాల్గొన్నారు.


పోడూరు : కళామతల్లి ముద్దుబిడ్డ ఎన్‌టీఆర్‌ అని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. మండలంలోని కవిటం, పోడూరు, పండితవిల్లూరు గ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కవిటం గ్రామ టీడీపీ అధ్యక్షుడు గుబ్బల అప్పన్నస్వామి  పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్య క్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు,టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గణ పతినీడి రాంబాబు,బొక్కా నాగేశ్వరరావు, రుద్రరాజు రవి పాల్గొన్నారు.


మొగల్తూరు :
గాంధీబొమ్మల సెంటర్‌లో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూల మాలలు నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుబ్బల నాగరాజు, పట్టణ అధ్యక్షుడు బస్వాని ఏడుకొండలు, కలి దిండి కుమార్‌ బాబు, జోగి పండు, కత్తిమండ ముత్యాలరావు, డొల్లా రత్నం రాజు, వర్ధనపు సుధాకర్‌, పాలా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పెనుమంట్ర : మార్టేరు,పొలమూరు,ఆలమూరులో ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెనుమంట్ర మండల టీడీపీ అధ్యక్షుడు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, జిన్నా ఆదినారాయణ, కడలి ఏడుకొండలు, చింతపల్లి రామకృష్ణ, ఇందుకూరి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2022-01-19T05:25:25+05:30 IST