ఎన్టీటీపీఎ్‌సలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-04-21T06:14:01+05:30 IST

ఎన్టీటీపీఎ్‌సలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా మొదటి దశలో ఎన్టీటీపీఎ్‌సలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు.

ఎన్టీటీపీఎ్‌సలో కరోనా కలకలం

వారం వ్యవధిలో నలుగురు ఇంజనీర్లు, కెమిస్టు మృత్యువాత

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 20: ఎన్టీటీపీఎ్‌సలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా మొదటి దశలో ఎన్టీటీపీఎ్‌సలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు. రెండవ దశ కరోనా మాత్రం ఉద్యోగుల్లో దడ పుట్టిస్తోంది. ఒక వైపు వ్యాక్సిన్‌ వచ్చినా మృత్యు ఘంటికలు మొగిస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీటీపీఎ్‌సలో  కాంట్రాక్టు కార్మికులతో కలిపి 5000 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 800 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నది అక్కడ కూడా కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా   ఇంజనీర్లు కరోనా బారిన పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వారం వ్యవధిలో నలుగురు ఉన్నతస్థాయి ఇంజనీర్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఒక కెమిస్టు కూడా మృతిచెందారు. వీరంతా 35 నుంచి 50 సంవత్సరాలు లోపు వయస్సు వారు కావడం గమనార్హం. ఇంకా పదుల సంఖ్యలో కరోనా బారిన పడటంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల కాలంలో విద్యార్థులకు సెలవులు ఇవ్వటంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీటీపీఎస్‌ ఉద్యోగుల పిల్లలు ఎక్కువ శాతం వసతి గృహాల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. వీరు ఒక్కసారిగా వసతి గృహాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత కొవిడ్‌ వ్యాప్తి చెంది ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్టీటీపీఎ్‌సలో ఉద్యోగుల భద్రత కోసం ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడం పట్ల, యాజమాన్యం తీరు పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి కోసం కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి చికిత్స అందించాల్సిన ఎపీ జెన్‌కో యాజమాన్యం నిమ్మకు నిరేత్తినట్లు వ్యహరిస్తోంది. ఇప్పటికే ఉద్యోగులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.

Updated Date - 2021-04-21T06:14:01+05:30 IST