పైకప్పు లేదు... గోడలు లేవు.. తలుపుల ఊసేలేదు... అయినా అందరూ మెచ్చే రెస్టారెంట్ ఇది!

ABN , First Publish Date - 2021-07-28T11:49:42+05:30 IST

ప్రపంచంలో ఎంజాయ్ చేసేందుకు అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి.

పైకప్పు లేదు... గోడలు లేవు.. తలుపుల ఊసేలేదు... అయినా అందరూ మెచ్చే రెస్టారెంట్ ఇది!

స్విట్జర్లాండ్: ప్రపంచంలో ఎంజాయ్ చేసేందుకు అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. పచ్చని తోటల్లో ప్రశాంతంగా విహరించాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రశాంతమైన నిర్మానుష్య ప్రదేశంలో ప్రకృతి ఒడిలో సేదతీరే అవకాశాన్ని కల్పిస్తోంది ఒక రెస్టారెంట్. దీని గురించి తెలుసుకుంటే అవాక్కవడం ఖాయం. ఎందుకంటే ఈ రెస్టారెంట్‌కు పైకప్పూ లేదు, గోడలు లేవు. ఇక తలుపుల ఊసన్నదే లేదు. అయితే ఆహ్లాదం కోరుకునేవారికి కావలసిన అన్ని సదుపాయాలు ఈ రెస్టారెంట్‌లో ఉన్నాయి.


ఈ రెస్టారెంట్ పేరు ‘నల్ స్టెర్న్’. ఇది స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఆల్ప్స్ పర్వతాల మధ్య ఉంది. జంటలు అమితంగా ఇష్టపడే రెస్టారెంట్‌గా ఇది పేరొందింది. ఈ రెస్టారెంట్‌లో ఆరుబయటనే నిద్రించాలి. 2016 జూలైలో ఒక పడకతో ఈ రెస్టారెంట్ ప్రారంభమయ్యింది. ఈ రెస్టారెంట్‌లో ఒక రాత్రి బస చేసేందుకు సుమారు 17 వేల రూపాయలు చెల్లించాల్సివుంటుంది. అయితే ఈ రెస్టారెంట్‌లో ఉండాలంటే అందుకు అనువైన వాతావరణం కూడా తప్పనిసరి. ఆర్టిస్ట్ ఫ్రాంక్, రికలిన్ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌లో వాష్‌రూమ్ కూడా ఉండదు. పబ్లిక్ టాయిలెట్‌నే వినియోగించుకోవాల్సి ఉంటుంది. నలువైపులా కొండలు, పైన ఆకాశం ఇవే ఈ రెస్టారెంట్ హద్దులు. ఇంతటి అందమైన ఈ రెస్టారెంట్‌లో ఈ ఏడాదికి బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. 2022, ఫిబ్రవరి నుంచి ఈ రెస్టారెంట్‌లో ఉండేందుకు పడకను బుక్ చేసుకోవచ్చు. 

Updated Date - 2021-07-28T11:49:42+05:30 IST