డాక్టర్ దవడ పగులగొట్టిన నర్స్... వీడియో వైరల్!

ABN , First Publish Date - 2021-04-27T16:19:31+05:30 IST

కరోనా వైరస్ ప్రజల ప్రాణాలనే కాదు వారి...

డాక్టర్ దవడ పగులగొట్టిన నర్స్... వీడియో వైరల్!

రామ్‌పూర్: కరోనా వైరస్ ప్రజల ప్రాణాలనే కాదు వారి మానసిక స్థితిని కూడా దెబ్బతీస్తోంది. దీనికి యూపీలోని రామ్‌పూర్‌లో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళితే రామ్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్, నర్స్ మధ్య వివాదం చోటుచేసుకుంది. అది పరస్పరం దాడి చేసుకునేవరకూ దారితీసింది. 


ఆసుపత్రికి వచ్చిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రికి కరోనా బాధితుల తాకిడి ఎక్కువైంది. ఫలితంగా వైద్యులు, నర్సుల మధ్య ఏదోఒక విషయమై వివాదాలు తలెత్తేవి. తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటనలో విధులు నిర్వహిస్తున్న ఒక డాక్టర్‌పై నర్సు దాడి చేశారు. వెంటనే సదరు డాక్టర్ కూడా ఆమెపై దాడి చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం ముందుగా నర్సు ఆ డాక్టర్ చెంప పగులగొట్టింది. వెంటనే అతను ఆమెపై దాడి చేశారు. తరువాత వారిరువురూ ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఈ ఉదంతాన్ని దాచిపెట్టేందుకు ఆసుపత్రి వర్గాలు ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-04-27T16:19:31+05:30 IST