Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లిపై టీఎంసీ ఎంపీ,సినీనటి Nusrat Jahan సంచలన వ్యాఖ్యలు

వారు పెళ్లి ఖర్చులు కూడా ఇవ్వలేదు...పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతా

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వైవాహిక స్థితికి సంబంధించి కొత్త వివాదానికి తెర లేపారు.నుస్రత్ జహాన్ కొంతకాలం డేటింగ్ తర్వాత 2019 జూన్ 19న టర్కీలో నిఖిల్ జైన్‌ని వివాహం చేసుకుంది. వారు నవంబర్ 2020 నుంచి విడిపోయారు.విడిపోయాక 2021 ఆగస్ట్ 26వతేదీన నుస్రత్ జహాన్ యిషాన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది.నుస్రత్ కుమారుడు ఇషాన్ జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్‌గుప్తా పేరును తండ్రిగా చేర్చింది. 

దీంతో ఎంపీ నుస్రత్ వ్యక్తిగత జీవితం గురించి పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో భారతీయ చట్టాల ప్రకారం నిఖిల్‌తో తన వివాహం చెల్లుబాటు కాదని నుస్రత్ వెల్లడించింది. ఇది అప్పట్లో వివాదానికి దారి తీసింది. ‘‘టర్కీలో జరిగిన నా పెళ్లికి వారు కనీసం హోటల్ బిల్లులు కూడా చెల్లించలేదు, వారికి నేను ఏమీ చెప్పనవసరం లేదు. నేను నిజాయితీపరురాలిని. నన్ను తప్పుగా చిత్రీకరించారు, ఇతరులను నిందించడం లేదా ఇతరులను చెడుగా చూపించడం చాలా సులభం’’ అని నుస్రత్ అన్నారు.

 వివాదంలో తాను ఎవరినీ లాగలేదని ఎంపీ పేర్కొంది.నవంబర్‌లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతానని ఆమె వెల్లడించారు. తన స్నేహితురాలైన సినీనటి స్రబంతి ఛటర్జీ కుంకుమ శిబిరం నుంచి నిష్క్రమించడంపై అడిగినప్పుడు, నుస్రత్ తాను ఎప్పుడూ ఎవరికీ రాజకీయ సలహా ఇవ్వనని చెప్పింది.యష్ కు కూడా తాను ఎలాంటి రాజకీయ సలహా ఇవ్వనని, అది వారి ఇష్టమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ అన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement