పోషకాల గని అవకాడో!

ABN , First Publish Date - 2021-05-20T04:32:10+05:30 IST

అవొకడో పండులో ఇరవైఐదు రకాల పోషకాలు లభిస్తాయి. చర్మసంరక్షణలోనూ ఈ పండు ఉపయోగపడుతుంది. ఆ విశేషాలు ఇవి...

పోషకాల గని అవకాడో!

అవొకడో పండులో ఇరవైఐదు రకాల పోషకాలు లభిస్తాయి. చర్మసంరక్షణలోనూ ఈ పండు ఉపయోగపడుతుంది. ఆ విశేషాలు ఇవి... 

  • ‘అవొకడో’లో విటమిన్‌ ఎ, బి, సి, ఇ, కె. ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలున్నాయి. అంతేకాకుండా ఫైబర్‌, ప్రొటీన్‌, బీటా-సైటోస్టెరాల్‌, గ్లూటథయోన్‌, ల్యూటెన్‌ వంటి ఫైటోకెమికల్స్‌ ఉన్నాయి. 
  • విటమిన్‌ బి6, ఫోలికాసిడ్‌ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి హోమోసిస్టిన్‌ స్థాయిలను నియంత్రిస్తాుయి. ఒకవేళ వీటి లెవెల్స్‌ పెరిగితే గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ ఇ, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
  • ఇందులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
  • అవొకడోలో ఉండే కెరొటినాయిడ్‌ ల్యూటిన్‌ క ళ్లను కాపాడుతుంది. వయసు పైబడటం వల్ల వచ్చే కాటరాక్ట్‌ సమస్యలను దరిచేరకుండా చూస్తుంది.
  • బరువు పెరగాలనుకునే వారికి అవొకడో మంచి ఆప్షన్‌. ఇందులో హెల్దీ క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగడానికి ఇవి బాగా దోహదపడతాయి. 
  • ఈ ఫ్రూట్‌లో ఫోలేట్‌ అత్యధికంగా ఉంటుంది. స్ర్టోక్‌ రిస్క్‌ను ఫోలేట్‌ బాగా తగ్గిస్తుందని పరిశోధనల్లో రుజువయింది.
  • డ్రైస్కిన్‌తో బాధపడుతున్నట్లయితే అవొకడో జ్యూస్‌ను రోజూ తీసుకోవాలి. జ్యూస్‌ తాగడం ఇష్టం లేకపోతే అవొకడో ఆయిల్‌ను శరీరానికి పట్టించాలి. ఈ నూనెను మీ శరీరం బాగా గ్రహిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
  • అవొకడోను మెత్తగా నూరి తేనె, పెరుగు కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌ వేసుకుంటే మృతకణాలన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
  • అవొకడోను మెత్తగా పేస్ట్‌ మాదిరిగా చేసి, దానికి కోడిగుడ్డు తెల్లసొన, ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తలకు పట్టి ంచాలి. అరగంట తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల శిరోజాలు మెరుస్తాయి.
  • అవొకడో గుజ్జును మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. అవొకడో గుజ్జుతో ముఖాన్ని రబ్‌ చేసి కొన్ని నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

Updated Date - 2021-05-20T04:32:10+05:30 IST