‘పౌష్టికాహారం పంపిణీలో అభివృద్ధి కమిటీలదే కీలక పాత్ర’

ABN , First Publish Date - 2021-04-16T06:06:21+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో పంపిణీ చేయడంలో నూతనంగా ఏర్పడిన అభివృద్ధి కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయని ఎంపీడీవో వీణాదేవి పేర్కొన్నారు.

‘పౌష్టికాహారం పంపిణీలో అభివృద్ధి కమిటీలదే కీలక పాత్ర’

అనపర్తి/రాజానగరం, ఏప్రిల్‌ 15: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో పంపిణీ చేయడంలో నూతనంగా ఏర్పడిన అభివృద్ధి కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయని ఎంపీడీవో వీణాదేవి పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు ఒక్క రోజు జరిగిన శిక్షణకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి కమిటీ బాధ్యతలను ఐపీడీఎస్‌ సీడీపీవో సీహెచ్‌ లక్ష్మి వివరించారు. కమిటీల ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజానగరంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో టి.నాగమణి మాట్లాడుతూ 15న రాజానగరం, 16న రాజమహేంద్రవరం రూరల్‌, 17న కడియం మండలంలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు. భవన నిర్మాణాల్లో నాణ్యతాలోపాలకు ఆస్కారం లేకుండా ఉండేం దుకే ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. రాజానగరం మండలంలో 12 కొత్త భవనాలు నిర్మించాల్సి ఉండగా, ఐదు పాత భవనాలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. ఓ అంగన్‌వాడీ కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజరు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, ముగ్గురు తల్లులతో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. శిక్షణలో అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:06:21+05:30 IST