వర్కవుట్‌ తర్వాత ఫుడ్‌

ABN , First Publish Date - 2020-08-27T05:30:00+05:30 IST

బరువు తగ్గాలని, శరీరం ఫిట్‌గా ఉండాలని... ఇలా ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యంతో వర్కవుట్స్‌ చేస్తుంటారు. అయితే వ్యాయామానికి ముందూ, తరువాతా శక్తితో నిండిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం...

వర్కవుట్‌ తర్వాత ఫుడ్‌

బరువు తగ్గాలని, శరీరం ఫిట్‌గా ఉండాలని... ఇలా ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యంతో వర్కవుట్స్‌ చేస్తుంటారు. అయితే వ్యాయామానికి ముందూ, తరువాతా శక్తితో నిండిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇలాచేయడం వల్ల ఫిట్‌నెస్‌ లక్ష్యాలు నెరవేరుతాయి. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. వర్కవుట్‌ తరువాత ఎలాంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. 



మీరు చేసే ఎక్సర్‌సైజ్స్‌ను బట్టి ప్రొటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌.... ఇలా వివిధ రకాల పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో వర్కవుట్‌ సమయంలో కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. శరీర  అలసట మాయమవుతుంది. కండరాలు శక్తిని పుంజుకుంటాయి. ఎముకల సాంద్రత పెరిగేందుకు, రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు పలురకాల పోషకాలను తీసుకోవాలి. 


వర్కవుట్‌కు తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు కార్డియో వ్యాయామాలు చేసిన తరువాత కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రొటీన్స్‌ తక్కువ మోతాదులో ఉండే అరటిపండుతో కూడిన ఓట్‌మీల్‌ తినాలి. అలాగే బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేసేవారు ప్రొటీన్లు సమృద్ధిగా లభించే చికెన్‌ బ్రెస్ట్‌, బ్రకోలి తినాలి. మిక్స్డ్‌ వర్కవుట్‌ చేసినట్లయితే స్వీట్‌ పొటాటో మాష్‌ను యోగర్ట్‌తో కలిపి తింటే ఫలితం ఉంటుంది. అలానే సరిపోనూ నీళ్లు తాగాలి.  


Updated Date - 2020-08-27T05:30:00+05:30 IST