ఈ పోషకాలతో రక్తపోటు అదుపు

ABN , First Publish Date - 2021-08-31T05:30:00+05:30 IST

రక్తపోటును క్రమబద్ధీకరణలో కొన్ని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ పోషకాలను నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటంటే...

ఈ పోషకాలతో రక్తపోటు అదుపు

రక్తపోటును క్రమబద్ధీకరణలో కొన్ని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ పోషకాలను నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటంటే...


పోటాషియం: గుండెలోని ఎలక్ట్రికల్‌ యాక్టివిటీని ఈ పోషకం క్రమబద్ధీకరిస్తుంది. పొటాషియం లోపం కారణంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రయోగాల్లో రుజువైంది. బంగాళాదుంపలు, అరటిపళ్లు, చిక్కుళ్లు, పాలకూర, మష్రూమ్స్‌లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

మెగ్నీషియం: రక్తపోటు పెరుగుదలకు మెగ్నీషియం లోపం కూడా దోహదపడుతుంది. ఇందుకు అధిక బరువుతో సంబంధం లేదు. బాదం, జీడిపప్పు, పాలకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి.

ఒమేగా - 3 ఫ్యాట్స్‌: గుండె ఆరోగ్యానికి తోడ్పడే డైటరీ ఫ్యాట్‌ ఇది. ఈ కొవ్వు కలిగి ఉండే ఫిష్‌ ఆయిల్స్‌ ఈ పోషకం లోపం మూలంగి పెరిగే రక్తపోటు నియంత్రణకు వాడుకోవచ్చు.

Updated Date - 2021-08-31T05:30:00+05:30 IST