Abn logo
Sep 22 2021 @ 01:02AM

పిల్లల ఆరోగ్యంకోసం పౌష్టికాహారం

అంగనవాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలిస్తున్న డీఈవో

 డీఈవో చైతన్యజైనీ 8 పలు పాఠశాలల తనిఖీ

భువనగిరిటౌన, సెప్టెంబరు 21: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగనవాడీకేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం విద్యార్థుల ఆరోగ్యానికి దోహదపడుతోంద ని డీఈవో చైతన్య జైనీ అన్నారు. భువనగిరిలోని ప్రభు త్వ బాలికల ఉన్నత పాఠశాల, తాతానగర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వేర్వేరుగా నిర్వహించిన పోషణ్‌ అభియాన ర్యాలీలను ఆమె ప్రారంభించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజ న నాణ్యతను పరిశీలించారు. అలాగే తాతానగర్‌ అంగనవాడీకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మెనూను పాఠశాలలు, అంగనవాడీ కేంద్రాల్లో విధిగా పా టించాలన్నారు. కార్యక్రమాల్లో జిల్లా సెక్టోరల్‌ అధికారి ఆండా లు, హెచఎంలు దామోదర్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌, పద్మావతి, అంగనవాడీ టీచర్లు బాలమణి, అరుణ, లలిత, రాములమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా బీబీనగర్‌ మండలం నెములగొముల ప్రాథమిక పాఠశాలను డీఈవో తనిఖీ చేశారు.