నువోకో విస్టాస్‌ రూ.5,000 కోట్ల ఐపీఓ

ABN , First Publish Date - 2021-05-07T06:13:47+05:30 IST

నిర్మా గ్రూప్‌నకు చెందిన సిమెంట్‌ తయారీ కంపెనీ నువోకో విస్టాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. క్యాపిటల్‌ నియంత్రణ మండలి ‘సెబీ’కి గురువారం పత్రాలు...

నువోకో విస్టాస్‌ రూ.5,000 కోట్ల ఐపీఓ

న్యూఢిల్లీ: నిర్మా గ్రూప్‌నకు చెందిన సిమెంట్‌ తయారీ కంపెనీ నువోకో విస్టాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. క్యాపిటల్‌ నియంత్రణ మండలి ‘సెబీ’కి గురువారం పత్రాలు కూడా సమర్పించింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5,000 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో రూ.1,500 కోట్లు తాజా ఈక్విటీ జారీ ద్వారా సేకరించనుంది. నువోకో ప్రమోటింగ్‌ కంపెనీ నియోగీ ఎంటర్‌ప్రైజ్‌ తన వాటా నుంచి రూ.3,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌  (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. 


సెన్సెక్స్‌ 272 పాయింట్లు అప్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 272.21 పాయింట్లు పెరిగి 48,949.76 వద్ద ముగిసిం ది.నిఫ్టీ 106.95 పాయింట్లు బలపడి 14,724 వద్ద స్థిరపడింది.   

Updated Date - 2021-05-07T06:13:47+05:30 IST