Abn logo
Apr 9 2021 @ 01:03AM

కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 8: జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు, వెల్‌నెస్‌ సెంటర్‌లో పనిచేసేందుకు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. క మ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా ఎంబీబీఎస్‌ లేదా ఆయూష్‌ కోర్సులైన్‌ డీఏఎంఎస్‌, డీహెచ్‌ఎంఎస్‌, ఎన్‌వైఎస్‌ కోర్సులు చదివిన వైద్యులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.  వీరితో పాటు స్టాఫ్‌ నర్సుల కోసం బీఎస్సీ నర్సింగ్‌ చదివి న వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఉందని తెలిపారు. ఏదైనా సందేహాలు ఉంటే సం బంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.

Advertisement
Advertisement