Abn logo
Oct 29 2020 @ 10:34AM

నెక్సియం లీడర్ కీత్ రినీరికి 120 ఏళ్ల జైలుశిక్ష

Kaakateeya

బ్రూక్లిన్: లైంగిక ఆరోపణలు, ఇతర నేరాలు రుజువుకావడంతో నెక్సియం లీడర్, సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్ గురు కీత్ రినీరి(60)కి యూఎస్ డిస్ట్రిక్ కోర్టు మంగళవారం 120 ఏళ్ల జైలుశిక్షను విధించింది. కీత్ తమను లైంగికంగా వేధించాడంటూ ఎంతో మంది యువతులు కోర్టులో సాక్ష్యం చెప్పడంతో జడ్జి నికోలాస్ గారాఫిక్ అతడికి శిక్షను ఖరారు చేశారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్సియం అనే సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ సంస్థను నడుపుతూ వచ్చిన కీత్ రినీరి ఎంతో మంది యువతులను తన లైంగిక కోరికలకు వాడుకున్నాడు. ఫాలోవర్స్‌గా ఉన్న యువతులను తనకు బానిసలుగా చేసుకుని శృంగార కోరికలను తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన సంస్థలో పనిచేసే అబ్బాయిలను కూడా మానసికంగా వేధిస్తూ వచ్చాడు. నెక్సియం సంస్థలో గతంలో పనిచేసిన 15 మంది ఉద్యోగులు కోర్టులో కీత్ రినీరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. కీత్ రినీరి తమను ఎన్ని చిత్రహింసలు పెట్టింది జడ్జికి వివరించారు. 

ఇక తమను లైంగికంగా వేధించాడంటూ తాము ఎదుర్కొన్న వేదన గురించి బాధిత యువతులు జడ్జికి తెలిపారు. యువతుల మాటలకు జడ్జి సైతం ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. కీత్ రినీరి లైంగికంగా వేధించాడంటూ మొట్టమొదటగా క్యామీలా అనే యువతి స్టేట్‌మెంట్ ఇచ్చింది. 2005లో తనకు 15 ఏళ్ల వయసున్నప్పుడు కీత్ రినీరి తనను లైంగికంగా వేధించినట్టు ఆమె తెలిపింది. కాగా.. కీత్ రినీరి నెక్సియంకు అమెరికాతో పాటు అనేక దేశాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. బడా బిలియనీర్లతో పాటు హాలీవుడ్ నటులు కూడా ఆయనకు కస్టమర్లుగా ఉన్నారు. నెక్సియం సంస్థ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోర్సులో చేరాలంటే వేల డాలర్లను చెల్లించాల్సిందే. అంతలా తన సంస్థ బ్రాండ్‌ను కీత్ రినీరి పెంచుకుంటూ వచ్చాడు.  

Advertisement
Advertisement