కరోనా దెబ్బకు.. ఖాళీ అయిపోయిన టైమ్స్ స్క్వేర్

ABN , First Publish Date - 2020-03-15T05:30:00+05:30 IST

కొవిడ్-19(కరోనా) ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తుందో కొత్తగా చెప్పనవసరం లేదు.

కరోనా దెబ్బకు.. ఖాళీ అయిపోయిన టైమ్స్ స్క్వేర్

న్యూయార్క్: కొవిడ్-19(కరోనా) ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తుందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా దాదాపు 5800 మంది మరణించగా.. లక్షలాది మంది చికిత్స పొందుతున్నారు. 149 దేశాలకు కరోనా విస్తరించింది. ఇప్పటికే అనేక దేశాల్లో స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. వీటితో పాటు రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రదేశాలను కూడా మూసివేశారు. దీంతో నిత్యం జనాల తాకిడితో ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతాన్ని ప్రస్తుతం చూస్తే కరోనా ప్రభావం ఎలా ఉందో అర్థమవుతుంది.


అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం అంటేనే నిత్యం కలర్ ఫుల్‌గా.. జనాలతో నిండి ఉంటుంది. టైమ్స్ స్క్వేర్ వద్ద న్యూఇయర్ వేడుకలను చూసేందుకు అమెరికా ప్రజలు ఏడాది మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు టైమ్స్ స్క్వేర్ వద్ద కనుచూపు మేరలో ఒక్కమనిషి కూడా కనిపించడం లేదు. అమెరికాలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో పర్యాటక ప్రదేశాలు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్క అమెరికానే కాదు... ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాల్లో ఇదే వాతావరణం కనపడుతోంది.

Updated Date - 2020-03-15T05:30:00+05:30 IST