వైరల్ అవుతున్న న్యూజిలాండ్ ప్రధాని వీడియో..!

ABN , First Publish Date - 2020-05-25T20:52:49+05:30 IST

న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రధాని వీడియో అంతగా వైరల్‌ కావడానికి అందులో ఏ

వైరల్ అవుతున్న న్యూజిలాండ్ ప్రధాని వీడియో..!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రధాని వీడియో అంతగా వైరల్‌ కావడానికి అందులో ఏముందని ఆలోచిస్తున్నారా. వేరే ఏం లేదండీ.. భూమి కంపిస్తున్నా.. ఆమె ధైర్యంగా కూర్చిని, టీవీ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌లో సోమవారం రోజు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అయితే న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చినప్పుడు.. ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్.. ఓ టీవీ చానల్‌కు ఇంటర్యూ ఇస్తున్నారు. భూమి కంపిస్తున్నా.. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. నవ్వుతూ అక్కడే కూర్చుండిపోయారు. ఇదంతా.. ఆ టీవీ చానల్ రికార్డు చేసి, ప్రసారం చేసింది. దీంతో న్యూజిలాండ్ ప్రధాని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై స్పందించిన ప్రధాని.. తాను ఉన్న ప్రాంతంలో భూమి స్వల్పంగానే కంపించిందని పేర్కొన్నారు. 

వీడియో సోర్స్: ది గార్డియన్ యూట్యూబ్ చానల్


Updated Date - 2020-05-25T20:52:49+05:30 IST