ఓ2సీ వ్యాపారాన్ని డీ మెర్జ్ చేస్తున్నాం... రిలయన్స్

ABN , First Publish Date - 2021-02-23T21:23:01+05:30 IST

: రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఓ2సీ(చమురు నుండి కెమికల్) వరకు ఉన్న తన వ్యాపారాన్ని డీ-మెర్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఓ2సీ వ్యాపారాన్ని డీ మెర్జ్ చేస్తున్నాం... రిలయన్స్

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం కీలక ప్రకటన చేసింది.  ఓ2సీ(చమురు నుండి కెమికల్) వరకు ఉన్న తన వ్యాపారాన్ని డీ-మెర్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో భారీ డీల్స్ కుదుర్చుకునే అవకాశాల కోసం పూర్తిస్థాయి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.


చమురురంగ దిగ్గజం సౌదీ ఆరామ్‌కోతో రిలయన్స్ ఇప్పటికే చర్చిస్తోన్న విషయం తెలిసిందే. కాగా... ఈ క్రమంలో... మంగళవారం విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి. ఓ2సీ  వ్యాపారాన్న డీ-మెర్జ్ ప్రణాళికను షేర్ హోల్డర్స్, క్రెడిటార్స్ ముందుంచింది. స్వతంత్రంగా ఉండటం ద్వారా ఓ2సీ అవకాశాలపై దృష్టి సారించి వ్యాల్యూను మరింత పెంచేలా ఉంటుందని రిలయన్స్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.


స్వయం మూలధన నిర్మాణం, అంకితభావం కలిగిన మేనేజ్‌మెంట్ టీమ్ ద్వారా వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటుందని పేర్కొంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలు,  పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ‘విలువ’ మరింత పెరిగేందుకు ఈ ‘డీ-మెర్జింగ్’ దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.  కాగా... ఆరామ్‌కో డీల్‌కు ముందు రిలయన్స్ ఓ2సీ వ్యాపార డీ-మెర్జర్‌ను రిలయన్స్ ప్రకటించింది.

Updated Date - 2021-02-23T21:23:01+05:30 IST