Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓట్స్‌ - కొబ్బరి దోశ

కావలసినవి: గోధుమ పిండి - అరకప్పు, బియ్యప్పిండి - అరకప్పు, ఓట్స్‌ పిండి - అరకప్పు, కొబ్బరి  సరిపడా, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం - చిన్నముక్క, కరివేపాకు - కొద్దిగా, ఇంగువ - చిటికెడు, మిరియాల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని అందులో బియ్యప్పిండి, ఓట్స్‌ పిండి, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి, సరిపడా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి. స్టవ్‌ పై పెనం పెట్టి దోశ పోసుకోవాలి. నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ దోశలు రుచిగా ఉండటమే కాకుండా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 


పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని