కొవిడ్ టీకా: ముగ్గురు యూఎస్ మాజీ అధ్యక్షుల సాహసోపేత నిర్ణయం!

ABN , First Publish Date - 2020-12-03T21:32:04+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది.

కొవిడ్ టీకా: ముగ్గురు యూఎస్ మాజీ అధ్యక్షుల సాహసోపేత నిర్ణయం!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. దేశంలో వైరస్ ప్రభావం మొదలైన తొలినాళ్లలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కాగా.. మధ్యలో కొంచెం తగ్గాయి. కానీ, గత కొన్ని రోజులుగా మళ్లీ అంతకంతకు కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే గానీ వైరస్‌ను అంతమొందించడం అంత సులువు కాదు అనేది వైద్య నిపుణుల మాట. కాగా, ఇప్పటికే యూఎస్‌కు చెందిన ఫైజర్, మోడెర్నా ఔషధ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్స్ ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. దీంతో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం పొందిన వెంటనే ప్రజలకు ఈ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. 


ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒబామా ప్రజల్లో టీకా భద్రత, ప్రభావంపై విశ్వాసాన్ని పెంపొందిచేందుకు తాను కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ తీసుకునేందుకు రెడీ అని ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమని అమెరికా అంటు వ్యాధి నిపుణుడు డా. ఆంథోనీ ఫౌసీ చెప్పినట్లయితే.. తాను కూడా పూర్తిగా విశ్వసిస్తానని, కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఒబామా అన్నారు. మరో మాజీ అధ్యక్షుడు జార్జీ బుష్ కూడా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ మీడియాతో అన్నారు. అలాగే వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి, ప్రోత్సహించడానికి బహిరంగంగా టీకాను తీసుకోవడానికి బిల్ క్లింటన్‌ కూడా రెడీగా ఉన్నారని ఆయన ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా వెల్లడించారు. ఇదిలా ఉంటే... అమెరికాలో కరాళ నృత్యం చేస్తున్న మహమ్మారి ఇప్పటివరకు 1.41 కోట్ల మందికి ప్రబలింది. అటు మృతుల సంఖ్య కూడా 2.80 లక్షలకు చేరువైంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది.   


కానీ, అక్కడి ప్రజల్లో ఈ వ్యాక్సిన్ల భద్రత, ప్రభావంపై అనుమానం నెలకొంది. దీంతో సుమారు 42 శాతం మంది ఈ టీకాలను తీసుకోవడానికి సుముఖంగా లేరని తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్‌ తాము స్వచ్ఛంగా టీకాలు తీసుకుంటామని ప్రకటించారు. ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తర్వాత కరోనా వ్యాక్సిన్లను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు అంగీకరించారు. 

Updated Date - 2020-12-03T21:32:04+05:30 IST