Advertisement
Advertisement
Abn logo
Advertisement

రుణాలకు ని‘బంధనా’లు

అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారుల ఇక్కట్లు

ఎస్సీ కార్పొరేషన్‌లో 598 యూనిట్లకు పూర్తయింది 45


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): రుణాల మంజూరులో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపంగా మారింది. దళిత నిరుద్యోగ యువతకు, రైతులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇచ్చే రుణాల మంజూరులో రెండేళ్లుగా అధికారులు జాప్యం చేస్తున్నారు. తమ ఇష్టంతో సంబంధంలేకుండా వారు చెప్పిన వ్యాపారం చేస్తేనే రుణమంటూ అధికారులు నిబంధన విధిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.


పేద దళితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.1లక్ష నుంచి రూ.10లక్షల వరకు బ్యాంకు రుణాలు మంజూ రు చేస్తోంది. దీంట్లో లబ్ధిదారుడికి 20 నుంచి 50శాతం వరకు ప్రభు త్వం రాయితీ ఇస్తోంది. చిరు వ్యాపారులు నిర్వహించేందుకు కోసం రూ.50వేల రుణాన్ని 100శాతం రాయితీతో ఇస్తోంది. 2018-19లో 598 మందికి పూర్తిస్థాయి రాయితీ రుణాలు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 45 యూనిట్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 553 మందికి యూనిట్లు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. లబ్ధిదారులు పేర్కొన్న యూనిట్లకు చెక్కులు ఇవ్వకుండా, తాము చెప్పిన వ్యాపారం చేస్తేనే రుణమని ఓ అధికారి షరతులు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాల మంజూరులో జాప్యాన్ని జిల్లాలోని అన్ని మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లెవనెత్తారు. అయినా వారిలో స్పందన కన్పించడంలేదు.


కరోనా రుణాలే లేవు..

కరోనా కాలంలో ప్రభుత్వం ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదు. 2019- 20లో లబ్ధిదారులకు రుణాలు ఇవ్వలేదు. 2020-21లో స్కిల్డ్‌ విభాగం కింద జిల్లా కు రూ.12.59కోట్లు, అన్‌స్కిల్డ్‌ విభాగం కింద రూ.7.13కోట్లు ప్రభుత్వం మంజూ రు చేసింది. మొత్తం జిల్లాకు రూ.19.73 కోట్లు మంజూరయ్యాయి. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు లబ్ధిదారుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను రెండు నెలల క్రితమే పరిశీలించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి రుణాలను మంజూరుచేయలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది.


రుణం కోసం ఏడాదిన్నరగా ఎదురుచూపులే : దాసరి ఆనంద్‌, పెద్దబండ, నల్లగొండ

ఎస్సీ కార్పొరేషన్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకుని ఏడాదిన్నర అవుతోంది. వెల్డింగ్‌ షాపు ప్రారంభించి స్వయం ఉపాధి పొందేందుకు దరఖాస్తు చేశా. ఇప్పటి వరకు రుణం మంజూరు కాలేదు. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించిన అధికారులు ఆతరువాత పట్టించుకోవడం మానేశారు. వెంటనే రుణం మంజూరు చేసి ఉపాధి అవకాశం కల్పించాలి.


త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం : వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం. లక్ష్యానికి మించి దరఖాస్తులు వచ్చాయి. దీంతో అన్ని దరఖాస్తులను పరిశీలించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే త్వరలోనే అర్హులైన లబ్ధిదారుల జాబితాను విడుదలచేస్తాం. పందిరి సాగు పంట రుణాలకు సంబంధించిన దరఖాస్తులను సైతం పరిశీలిస్తున్నాం. త్వరలోనే రాయితీ రుణాలు మంజూరు చేస్తాం.


ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు ఇలా...

ఆర్థిక మంజూరైన రుణం సబ్సిడీ వచ్చిన సబ్సిడీ గ్రౌండింగైన రుణం

సంవత్సరం యూనిట్లు (రూ.లక్షల్లో) యూనిట్లు (రూ.లక్షల్లో) యూనిట్లు (రూ.లక్షల్లో)

2016-17 869 1057.48 869 1057.48 821 984.18

2017-18 1797 1985 1797 1985 1572 1715.72

2018-19 556 650.5 289 328 42 38.20

2018-19 598 299 348 174 45 22.50


సంవత్సరం స్కిల్డ్‌ విభాగం అన్‌స్కిల్డ్‌ విభాగం మొత్తం

(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)

2020-21 1259.90 713.91 1973.81

Advertisement
Advertisement