Abn logo
Oct 29 2020 @ 01:11AM

రైతువేదిక పనులను పరిశీలన

చింతకాని, అక్టోబరు 28: మండలంలో పొద్దుటూరు గ్రామంలో జరుగుతున్న రైతువేదిక నిర్మాణ పనులను జడ్పీచైర్మన్‌ లింగాల కమలరాజు బుధవారం పరిశీలించారు. కనకదుర్గమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా నాగిలిగొండ గ్రామంలో బరిగల వెంకటేశ్వర్లు కుమార్తె కృష్ణవేణి వివాహ కార్యక్రమానికి హాజరైన వధువును ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, కార్యదర్శి వేముల నర్సయ్య, సొసైటీ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, గడ్డం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement