పుష్కరఘాట్‌ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-04-07T04:22:46+05:30 IST

మండలంలోని దేవులవాడ వీఐపీ పుష్కర ఘాట్‌ పనులను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయరామా రావు బుధవారం పరిశీలించారు

పుష్కరఘాట్‌ పనుల పరిశీలన
దేవులవాడ వీఐపీ పుష్కరఘాట్‌ను పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు

కోటపల్లి, ఏప్రిల్‌ 6: మండలంలోని దేవులవాడ వీఐపీ పుష్కర ఘాట్‌ పనులను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయరామా రావు బుధవారం పరిశీలించారు. ఇక్కడ చేపట్టాల్సిన పనులపై డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేశ్వర్‌,  ఘాట్‌ ఇన్‌చార్జి అనూషకు పలు సూచనలు చేశారు. ప్రాణహిత పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై చర్చించి వీఐలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒనగూర్చాల్సిన సౌకర్యాలపై సమీక్షించారు. వీఐపీ ఘాట్‌ వద్ద నీరు పుష్కలంగా ఉండడంతో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సూచనలు చేశారు.

Updated Date - 2022-04-07T04:22:46+05:30 IST