ప్రభుత్వ స్థలం స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-28T05:19:37+05:30 IST

ప్రభుత్వ స్థలం స్వాధీనం

ప్రభుత్వ స్థలం స్వాధీనం
సర్వేనెంబర్‌ 140లో బోర్డు పాతుతున్న రెవెన్యూ అధికారులు

కేశంపేట, జనవరి 27: మండలంలోని మంగళగూడ శివారులోని సర్వే నెంబర్‌, 140 లోని ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 2ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా కొంత భూమి కొందరు సాగు చేసుకుంటున్నారు. కొంత ఖాళీ ఉంది. గ్రామానికిచెందిన మెగుళ్ల అంజయ్య, పర్వతాలు, చెన్నయ్య, ఎల్లయ్య, నర్సింహ 15 గుంటలు కబ్జాచేసి సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఎస్సై వెంకటేశ్వర్లు బందోబస్తు మధ్య తహసీల్దార్‌ మురళీకృష్ణ తన సిబ్బంది ఆర్‌ఐ చెన్నకేశవులు, సర్వేయర్‌ భీమ్లానాయక్‌లతో కలిసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని కంచె ఏర్పాటు చేసి బోర్డు పాతారు. కబ్జాలో ఉన్న రైతులకు గతంలోనే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతేనే బందోబస్తు మధ్య ప్రభుత్వభూమిని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్‌ మురళీకృష్ణ వివరించారు. సర్వేనెంబర్‌ 140లో ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం పట్ల గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఐదుగురు దళిత రైతులనుంచి ప్రభుత్వం భూమి లాక్కుంటోందని ఆరోపిస్తున్నారు. సర్వేనెంబర్‌ 140లో ఇంకా మిగులు భూమిని ఉందని, దాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సర్వే చేస్తున్న స్థలంలోకి గ్రామస్థులను ఎందుకు అనుమతించలేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే సర్వే నెంబర్‌లో పవన్‌ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి గోతులు తీసినా అధికారులు పట్టించుకోలేదని దళితులు ఆరోపించారు.

Updated Date - 2022-01-28T05:19:37+05:30 IST