వందల కోట్ల విలువైన స్థలం ఆక్రమణ.. వందేళ్ల తర్వాత న్యాయం.. ప్రతిఫలం ఎంతంటే..

ABN , First Publish Date - 2021-10-03T22:19:55+05:30 IST

నగరాలు, పట్టణాల్లో సెంటు స్థలం ఉందంటే.. ఎప్పుడెప్పుడు కాజేద్దమా అనుకుంటూ వందల కళ్లు చూస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆక్రమణకు గురైందా.. తిరిగి దక్కించుకోవాలంటే జరగని పని. ఒకవేళ కోర్టుల్లో కేసులు వేసినా..

వందల కోట్ల విలువైన స్థలం ఆక్రమణ.. వందేళ్ల తర్వాత న్యాయం.. ప్రతిఫలం ఎంతంటే..

నగరాలు, పట్టణాల్లో సెంటు స్థలం ఉందంటే.. ఎప్పుడెప్పుడు కాజేద్దమా అనుకుంటూ వందల కళ్లు చూస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆక్రమణకు గురైందా.. తిరిగి దక్కించుకోవాలంటే జరగని పని. ఒకవేళ కోర్టుల్లో కేసులు వేసినా.. సంవత్సరాలు సంవత్సరాలు వాటి చుట్టూ తిరగాలి. అప్పటికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండదు. అలాంటిది ఎప్పుడో పూర్వ కాలంలో ఆక్రమణకు గురైన కోట్ల విలువైన స్థలం, మళ్లీ దక్కుతుందంటే కలలో కూడా నమ్మకం ఉండదు. కానీ ఓ కుటుంబాన్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అది 1900 సంవత్సరం.. వాషింగ్టన్‌లో తెల్ల జాతీయులు, నల్ల జాతీయులకు మధ్య  ఘర్షణలు జరుగుతున్న సమయం. అనంతర కాలంలో దక్షిణ కాలిఫోర్నియాలో ఉంటున్న బ్రూస్‌ కుటుంబం.. నల్ల జాతీయుల కోసం ఆ ప్రాంతంలోని బీచ్‌లో 1912లో వెస్ట్‌కోస్ట్‌ రిసార్ట్‌ స్థాపించారు. అందులో లాడ్జి, కేఫ్, డ్యాన్స్ హాల్, డ్రెస్సింగ్ టెంట్‌ తదితర సౌకర్యాలు కల్పించారు. దక్షిణ కాలిఫోర్నియా ట్రేడ్‌మార్క్ బీచ్‌లలోనే దీనికి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ఈ రిసార్ట్‌.. మల్టీ మిలియన్ డాలర్ల విలువ చేసే ఇళ్ల సముదాయాల మధ్యలో ఉంది.


నల్ల జాతీయుల కోసం బ్రూస్‌ కుటుంబం.. రిసార్ట్ నిర్మించడం శత్రువులకు నచ్చలేదు. దీంతో దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కుట్ర పన్నారు. అదే స్థలంలో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు 1920లో మాన్హాటన్ బీచ్ సిటీ కౌన్సిల్ ప్రకటించింది. బ్రూస్ కుటుంబం నుంచి స్థలాన్ని సేకరించేందుకు.. ప్రముఖ డొమైన్‌ని ఆహ్వానించింది. అనంతరం స్థలం వారి స్వాధీనం అయింది. దీంతో మళ్లీ దాన్ని సొంతం చేసుకునేందుకు.. బ్రూస్ కుటుంబం కొన్నేళ్ల పాటు పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.


ప్రస్తుతం ఆ స్థలం విలువ రూ.555కోట్లకు పైమాటే. ఇంతటి ఖరీదైన స్థలం తమకు ఇక దక్కదని బ్రూస్ కుటుంబ వారసులు ఆశలు వదులుకున్నారు. ఎప్పుడో 1924లో ఆక్రమణకు గురైన స్థలాన్ని.. మళ్లీ యజమానులకు అప్పగించనున్నట్లు  కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఈ వార్త విని బ్రూస్ వారసులు.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. గతంలో జరిగిన తప్పును సరిదిద్దామని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ట్వీట్ చేశారు. బ్రూస్ కుటుంబ ముని మనువడికి స్థలం అప్పగిస్తూ.. బిల్లుపై గవర్నర్ సంతకం చేశారు. దీంతో 75 మిలియన్‌ డాలర్ల (రూ.555కోట్ల) స్థలం వారికి సొంతమైంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. వాహ్వా.. ఏం న్యాయం చేశారంటూ కాలిఫోర్నియా గవర్నర్‌ను.. నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.



Updated Date - 2021-10-03T22:19:55+05:30 IST