నిబంధనలకు విరుద్ధంగా భూముల ఆక్రమణ

ABN , First Publish Date - 2022-01-22T06:22:32+05:30 IST

రెవెన్యూ చట్టాలకు విరుద్ధంగా ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలంటూ నాలుగు కంపెనీలకు తహసీల్దార్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా భూముల ఆక్రమణ

  ఖాళీ చేయాలంటూ నాలుగు కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు 

  జారీ చేసిన బొమ్మలరామారం తహసీల్దార్‌

యాదాద్రి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ చట్టాలకు విరుద్ధంగా ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలంటూ నాలుగు కంపెనీలకు తహసీల్దార్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన నోటీసులు జారీచేయగా శుక్రవారం విషయం వెలుగుచూసింది. యాదా ద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలోని సర్వేనెంబర్‌ 208/1లో ఎ.జయరాంరెడ్డితోపాటు పలువురు సాల్వో ఎక్స్‌ప్లోజివ్‌, కెమికల్స్‌ కంపెనీ పేరున 9.39 ఎకరాలు ఆక్రమించారని తహసీల్దార్‌ పద్మసుందరి ఈ నెల 13వ తేదీన నోటీసు లు జారీ చేశారు. ఆపి్ట్రక్స్‌ లేబోరేటరి ప్రైవేట్‌ లిమిటెడ్‌ 3.04ఎకరాలు, బాలాజీ స్టోన మెటల్‌ ఇండస్ర్టీస్‌, వీవీ వాసుదేవ్‌గౌడ్‌, సాయివెంకటరమణ మెటల్‌ ఇండసీ్ట్రస్‌, ఎల్‌.రామకృష్ణారెడ్డి 0.24గుంటలు మొత్తం 13.27 ఎకరాల భూమిలో అనధికారికంగా ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ చట్టాలకు విరుద్దంగా ఆక్రమించిన భూమిని ఎందుకు ఖాళీ చేయకూడదో ఈ నెల 28వ తేదీలోగా వివరణ ఇవ్వాలన్నారు. 

ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రజాప్రయోజనాల వ్యాజ్యం

బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలోని సర్వేనెంబర్‌ 208లో ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ తుర్కపల్లి మ ండలకేంద్రానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరె డ్డి 2018లో హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని వేశారు. 2018 ఆగస్టులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రామలింగంపల్లిలోని 208/1లో సర్వే నెంబర్ల వారీగా సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-01-22T06:22:32+05:30 IST