భీమిలిలో రూ.60 కోట్ల స్థలం ఆక్రమణ

ABN , First Publish Date - 2021-06-12T05:52:43+05:30 IST

భీమునిపట్నంలో ఆక్రమణకు గురైన రూ.60 కోట్ల విలువైన స్థలాన్ని వీఎంఆర్‌డీఏ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు.

భీమిలిలో రూ.60 కోట్ల స్థలం ఆక్రమణ
ఆక్రమిత స్థలాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ కోటేశ్వరరావు

స్వాధీనం చేసుకున్న వీఎంఆర్‌డీఏ అధికారులు

విశాఖపట్నం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): భీమునిపట్నంలో ఆక్రమణకు గురైన రూ.60 కోట్ల విలువైన స్థలాన్ని వీఎంఆర్‌డీఏ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు. టౌన్‌ సర్వే నంబరు 1507, 1521లలో వీఎంఆర్‌డీఏకు 3.09 ఎకరాల భూమి ఉంది. అయితే దానిని ఇటీవల కొంతమంది చదును చేసి, ప్రహరీ నిర్మించారు. దీనిపై సమాచారం అందుకున్న కమిషనర్‌ కోటేశ్వరరావు శుక్రవారం ఎస్‌ఈ రామమోహన్‌రావు, ఇన్‌చార్జి ఎస్టేట్‌ అధికారిణి మనీషా త్రిపాఠి తదితరులతో కలిసి వెళ్లి పరిశీలించారు. భూమికి సరిహద్దులు నిర్ణయించి, వెంటనే చుట్టూ కంచె వేయాలని ఆదేశించారు. ఆ భూమిలో సంస్థ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.  


Updated Date - 2021-06-12T05:52:43+05:30 IST