Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంచర్‌ నిర్వాహకుల ఆక్రమణ

  • చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్ల ఫిర్యాదు

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్‌లో హుడా లే అవుట్‌ పేరు తో అక్రమాలకు పాల్పడుతున్న శ్రీసాయి డ్రీమ్‌ హోమ్స్‌ లేఅవుట్‌ నిర్వాహకులపై చర్యలు తీ సుకోవాలని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, పలువురు కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌ వసంతకు ఫిర్యాదు చేశారు. కొండాపూర్‌లోని సర్వే నెంబర్లు 35, 36, 47, 48, 58, 59, 60, 61లలో చేపట్టిన హుడా లేఅవుట్‌ నిర్వహకులు 35ఎకరాల భూమిని కొనుగోలు చేసి 40ఎకరాల్లో లే అవుట్‌ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సర్వే నెంబర్లలో తనకు కూడా ఎకరం ఉందని వైస్‌చైర్మన్‌ తెలిపారు. తన ప్రమేయం లేకుండానే సాగు భూమిని ప్లాట్లుగా మార్చారని తెలిపారు. కమర్షియన్‌ కన్వర్షన్‌ లేకుండానే హెచ్‌ఎండీఏ ఎల్పీ నెంబర్‌ జారీ చేయడంతో నందున ప్లాట్ల విక్రయాలు, రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయని వివరించారు. కొనుగోలు చేసిన భూమికంటే ఎక్కువ భూమిని ప్లాట్లు చేసినందున కొనుగోలుదారులు మోసపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో కౌన్సిలర్లు వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు, రవీందర్‌, మల్లేష్‌, షౌకత్‌ మియా ఉన్నారు.

Advertisement
Advertisement