అన్నా... మీరే న్యాయం చెప్పండి!

ABN , First Publish Date - 2021-01-16T09:52:49+05:30 IST

‘‘మా భూములను ప్రవీణ్‌రావు ఆక్రమించాడు. మాకు అన్యాయం జరిగింది. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఇరికించారే తప్ప.. ఈ కిడ్నా్‌పతో నాకు ఎలాంటి సం బంధం లేదు’’ అని ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ

అన్నా... మీరే న్యాయం చెప్పండి!

  • మా భూములే ఆక్రమించాడు
  • పోలీసుల విచారణలో వాపోయిన అఖిల ప్రియ
  • భార్గవ్‌ కుటుంబం మొత్తంపై కేసులకు చాన్స్‌


హైదరాబాద్‌ సిటీ, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ‘‘మా భూములను ప్రవీణ్‌రావు ఆక్రమించాడు. మాకు అన్యాయం జరిగింది. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఇరికించారే తప్ప.. ఈ కిడ్నా్‌పతో నాకు ఎలాంటి సం బంధం లేదు’’ అని ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ పోలీసులకు చెప్పారు. మూడు రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. బేగంపేట మహిళా ఠాణాలో విచారించిన విషయం తెలిసిందే. విచారణలో ఆమె చాలా వరకు మౌనముద్ర దాల్చినట్లు.. దర్యా ప్తు అధికారులను ‘అన్నా’ అని సంబోధించినట్లు తెలిసింది. పక్కా ఆధారాలను చూపుతూ అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆమె బదులిచ్చినట్లు సమాచారం.


‘‘మా నాన్నకు(భూమా నాగిరెడ్డి) హఫీజ్‌పేట సర్వే నంబర్‌ 80లో 33 ఎకరాల భూమి ఉంది. ఏవీ సుబ్బారెడ్డి ఆ భూములను పర్యవేక్షించేవాడు. 2005 నుంచి ఆ భూముల విషయంలో మా నాన్నకు కృష్ణారావు అనే న్యాయవాది సలహాదారుగా ఉండేవారు. ఆయన కుమారుడే ప్రవీణ్‌కుమార్‌(ప్రవీణ్‌రావు). కృష్ణారావు మేనల్లుడు సునీల్‌రావు. కృష్ణారావు మ రణంతో.. ఆ బాధ్యతలను ప్రవీణ్‌కుమార్‌, సునీల్‌రావు తీసుకున్నారు. ఆ భూముల వెనక ఉన్న న్యాయవివాదాలను ఆసరాగా చేసుకుని.. మొత్తం స్థలాన్ని ఆక్రమించేశారు. వారి నుంచి లబ్ధి పొందిన ఏవీ సుబ్బారెడ్డి పక్కకు తప్పుకొన్నాడు. మా వాటా కోసం పోరాడాను. ప్రవీణ్‌కుమార్‌, సునీల్‌రావుతో చర్చలకు ప్ర యత్నించాను’’ అని ఆమె పోలీసులకు వివరించినట్లు తెలిసింది. అయితే.. వారి కిడ్నా్‌పతో తనకు ఎలాంటి సంబం ధం లేదని ఆమె పోలీసులతో పదేపదే అన్నట్లు సమాచారం. ‘‘అన్నా (దర్యాప్తు అధికారులను ఉద్దేశించి).. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి’’ అని ఆమె వ్యాఖ్యానించడంతో.. ఏం చేయాలో తెలియక పోలీసులు మౌనముద్ర దాల్చినట్లు తెలిసింది. దీంతో.. మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం  ఆమె సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.


అఖిలకు పాటిగడ్డ ఆస్పత్రిలో కరోనా పరీక్ష

అఖిలప్రియ పోలీసు కస్టడీ ముగియడంతో.. గురువారం మధ్యాహ్నం ఆమెకు బేగంపేట పాటిగడ్డలోని బస్తీ దవాఖానాలో కరోనా పరీక్షలు చేయించినట్లు తెలిసింది. ఆమెకు నెగటివ్‌ అని తేలడంతో.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. గర్భవతిగా ఉన్న అఖిలకు అక్కడ పలు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మారేడ్‌పల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరిచి.. తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై శనివారం విచారణ జరగనుంది. పోలీసు విచారణ పూర్తికావడం.. గర్భవతిగా ఉండటాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని, ఆమెకు షరతులతో కూడిన బెయి ల్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-16T09:52:49+05:30 IST