ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం

ABN , First Publish Date - 2021-12-07T06:07:34+05:30 IST

ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని ఆర్‌ఐ షేక్‌ బేగం హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం
ఆక్రమిత భూముల్లో రెవెన్యూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన దృశ్యం

అర్‌ఐ షేక్‌ బేగం.. ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌


అనకాపల్లి రూరల్‌, డిసెంబరు 6: ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని ఆర్‌ఐ షేక్‌ బేగం హెచ్చరించారు. మండలంలోని మారేడుపూడి గ్రామంలో పలు చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండడంతో ‘మారేడుపూడిలో భూ దందా’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 3న వెలువడిన కథనానికి రెవెన్యూ అఽధికారులు స్పందించారు. ఇందులో భాగంగా సోమవారం ఆక్రమణలు జరుగుతున్న స్థలాలను పరిశీలించి రెవెన్యూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఆర్‌ఐ బేగం మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఆర్వో సేనాపతి సూర్యనారాయణ, వీఆర్‌ఏ నీలబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:07:34+05:30 IST