అక్టోబరు... ‘జాబ్ మార్కెట్’...

ABN , First Publish Date - 2021-09-15T22:59:39+05:30 IST

ఉద్యోగ నియామకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఆయా రంగాల్లో ఉద్యోగాలు ఊపందుకుంటున్నాయి.

అక్టోబరు... ‘జాబ్ మార్కెట్’...

హైదరాబాద్ : ఉద్యోగ నియామకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఆయా రంగాల్లో ఉద్యోగాలు ఊపందుకుంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ముప్పు లేనిపక్షంలో... ఈ త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు) నుండి నియామకాలు మరింత పెరుగుతాయని మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే వెల్లడించింది. దాదాపు 3,046 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి మ్యాన్‌పవర్ గ్రూప్ నెట్... ‘ ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్’ పేరుతో ఈ సర్వేను రూపొందించారు.


సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 44 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల కాలంలో నియామకాలు పెంచనున్నయ్లు వెల్లడించాయి. నియామకాలపై కంపెనీలు గత ఏడేళ్లలో ఇంత ఆశాభావంతో ఎప్పుడూ లేవని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండడంతో సరైన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం ప్రస్తుతం కంపెనీలకు సమస్యగా మారిందని సర్వేలో తేలింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ప్రముఖ జాబ్ వెబ్‌సైట్లు నౌకరీ.కాం, మ్యాన్‌పవర్ తదితర సంస్థలు  కరోనా ప్రభావం తగ్గి భారత్‌లో ఉద్యోగాలు పెరుగుతున్నాయని చెబుతున్నాయి. దేశంలో జాబ్ మార్కెట్ వేగంగా పుంజుకుంటోన్న సంకేతాలు కనిపిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో నియామకాలు జోరుగా ఉంటాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా నివేదిక.పేర్కొంది. 


అక్టోబరు-డిసెంబరు కాలంలో నియామకాలు గత ఏడేళ్లతో పోలిస్తే అత్యంత ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొంది. మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని దాదాపు సగం కంపెనీలు చెప్పాయి.  కొత్త కొలువుల పట్ల కార్పోరేట్ల నుండి ఇంత సానుకూలత గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. మొత్తంమీద... కరోనా కారణంగా మందగించిన నియామకాలు ఇప్పుడు వేగవంతం కానున్నట్లు తాజా పరిస్థితులు చెబుతున్నాయి.. డిసెంబరులోగా మరింత మందిని నియమించుకుంటామని ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2021-09-15T22:59:39+05:30 IST