ఓడినా అధికారాన్ని సులువుగా వీడను: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-09-25T06:59:55+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తాను ఓడినా ప్రత్యర్థి జో బిడెన్‌కు అధికారాన్ని అంత సులువుగా అప్పగించడానికి సిద్ధంగాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు...

ఓడినా అధికారాన్ని సులువుగా వీడను: ట్రంప్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 24: వచ్చే ఎన్నికల్లో తాను ఓడినా ప్రత్యర్థి జో బిడెన్‌కు అధికారాన్ని అంత సులువుగా అప్పగించడానికి సిద్ధంగాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితం సుప్రీంకోర్టు ద్వారానే తేలుతుందన్నారు. మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ను అనుమతించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ విధానాన్ని ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ట్రంప్‌వైపే మొగ్గు చూపుతున్నారు. ఇండియా ప్రధాని మోదీతో ట్రంప్‌కు ఉన్న స్నేహబంధమే దీనికి ప్రధాన కారణమని ఓ సర్వే వెల్లడించింది. అంతర్జాతీయంగా భారత్‌ ప్రాముఖ్యంపెరగడంలో ట్రంప్‌ కీలక పాత్ర పోషించారని భారతీయ అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. చైనా పట్ల ట్రంప్‌ కఠిన వైఖరిని కలిగి ఉండడం మరోకారణమని కూడా వివరించింది.

Updated Date - 2020-09-25T06:59:55+05:30 IST