భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. వధువు మెడలో తాళి కట్టిన వరుడు!

ABN , First Publish Date - 2021-12-24T00:51:30+05:30 IST

యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ముహూర్తాన్ని ఖరారు చేసి, పెళ్లి పత్రికలను బంధువులు, సన్నిహితులకు పంచారు. ఈ క్రమంలో వివాహ వేదిక వద్దకు చేరుకు

భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. వధువు మెడలో తాళి కట్టిన వరుడు!

ఇంటర్నెట్ డెస్క్: యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ముహూర్తాన్ని ఖరారు చేసి, పెళ్లి పత్రికలను బంధువులు, సన్నిహితులకు పంచారు. ఈ క్రమంలో వివాహ వేదిక వద్దకు చేరుకున్న అతిథులు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. వేదిక వద్ద కళ్యాణ మండపం, పురోహితుడు కనిపించకపోవడంతో కంగుతిన్నారు. ఆ తర్వాత నూతన వధూవరులు పెళ్లి బంధంతో ఒక్కటైన తీరును చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకూ ఏం జరిగిందంటే..


ఒడిశాకు చెందిన బెర్హంపూర్ ప్రాంతానికి చెందిన బిజయ్ కుమార్ (29), ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రుతి సక్సేనా (27).. ఇద్దరూ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని ఇంట్లో చెప్పి, పెళ్లికి ఒప్పించారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ముమూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ కళ్యాణ మండపం కానీ.. పురోహితుడు కానీ కనిపించకపోవడంతో షాకయ్యారు. వధూవరులు ఇద్దరూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన తర్వాత శ్రుతి సక్సేనా మెడలో బిజయ్ కుమార్ తాళి కట్టడాన్ని చూసి ఓ క్షణం పాటు విస్తుపోయారు.

 


ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత వధూవరులు ఇద్దరూ రక్తదానం చేశారు. వివాహానికి వచ్చిన అతిథులను ఖరీదైన గిప్ట్‌లకు బదులు.. రక్తదానం చేయాలని వధూవరులు కోరారు. అంతేకాకుండా అవయవదానం కూడా చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో పెళ్లికి హాజరైన బంధు మిత్రులు వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా బిజయ్ కుమార్ తండ్రి మాట్లాడుతూ.. 2019లో తన పెద్ద కొడుకు పెళ్లిని కూడా ఇదే విధంగా చేసినట్టు వివరించారు. భారతీయులు అందరూ పవిత్ర గ్రంథంగా భావించే.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, వివాహం చేసుకునేందుకు యువతి ముందుకు రావాలని సూచించారు. 




Updated Date - 2021-12-24T00:51:30+05:30 IST