శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా అధికారుల హల్‌చల్

ABN , First Publish Date - 2021-09-07T19:52:51+05:30 IST

కాకుళం: జిల్లాలో ఒడిశా అధికారుల హల్‌చల్ చేశారు. ఒడిశా సరిహద్దు గ్రామంలోని ఆంధ్రా భూభాగంలో రెచ్చిపోయారు.

శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా అధికారుల హల్‌చల్

శ్రీకాకుళం: జిల్లాలో ఒడిశా అధికారులు హల్‌చల్ చేశారు. ఒడిశా సరిహద్దు గ్రామంలోని ఆంధ్రా భూభాగంలో రెచ్చిపోయారు. మందస మండలం, సాబకోట పంచాయతీ, మాణిక్యపురంలో ఆంధ్రా అంగన్‌వాడి కేంద్రానికి ఒడిశా అధికారులు తాళం వేశారు. తమ భూభాగంలో అంగన్‌వాడి కేంద్రం ఏర్పాటు చేశారంటూ పోలీసులతో వచ్చి హంగామా చేశారు. ఒడిశా అధికారులను అంగన్‌వాడి కార్యకర్త సవర లక్ష్మి భర్త అడ్డుకున్నారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి పర్లాకిమిడి పీఎస్‌కు తరలించారు.


విషయం తెలుసుకున్న మందస మండల రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు చేరుకుని కారణాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అంగన్‌వాడి కేంద్రం ఆంధ్రా భూభాగంలోనే ఉందని, ఒడిశా అధికారులు సరిహద్దు గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మంచిదికాదని అన్నారు. ఒడిశా అధికారుల తీరును ఏపీ అధికారులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Updated Date - 2021-09-07T19:52:51+05:30 IST