పది లక్షల మాస్కులు పంపిణీ చేసిన స్వయం సహాయక సంఘాలు

ABN , First Publish Date - 2020-04-05T20:48:25+05:30 IST

భారతదేశంలో కోవిడ్-19 కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాస్కులు, ఇతర రక్షణ వస్తువుల కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో

పది లక్షల మాస్కులు పంపిణీ చేసిన స్వయం సహాయక సంఘాలు

భువనేశ్వర్: భారతదేశంలో కోవిడ్-19 కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాస్కులు, ఇతర రక్షణ వస్తువుల కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వ సహాయంతో అక్కడి స్వయం సహాయక సంఘాలు పది లక్షల మాస్కులను తయారు చేసి.. ప్రజలకు పంపిణీ చేశాయి. 


ఒడిశా ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ శక్తి‌లో 400లకుపైగా స్వయం సహాయక సంఘాలు పని చేస్తున్నాయి. వీరంతా కలిసి రోజులో కనీసం 50వేల మాస్కులు తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తున్నారని.. ఓ సీనియర్ అధికారి తెలిపారు. మాస్కులను సరసమైన ధరలకే అమ్ముతున్నామని ప్రజల సంక్షేమం కోసం మహిళలు పాటుపడుతున్నారని.. ఆయన పేర్కొన్నారు. 


‘‘స్థానిక అధికారుల సహాయంతో స్వయం సహాయక సంఘాలు అవసరంలో ఉన్న వారికి కూరగాయలు, పండ్లు, నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T20:48:25+05:30 IST