Chennai Pavement నుంచి ఎంత సాధించారంటే..?

ABN , First Publish Date - 2021-10-23T01:00:46+05:30 IST

క్వీన్ మేరీ కాలేజీ నుంచి బీఎస్సీ టూరిజంలో సుగన్య డిగ్రీ తీసుకుంది. క్వీద్ ఎ మిల్లత్ కాలేజీ నుంచి బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసింది రఫిషా. 2019లో తన డిగ్ర పూర్తైందని ఆరు నెలల పాటు రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాల్లో టూరిస్ట్ గైడర్‌గా కూడా పని చేసినట్లు సుగన్య చెప్పుకొచ్చింది.

Chennai Pavement నుంచి ఎంత సాధించారంటే..?

చెన్నై: మట్టిలో మాణిక్యాలు చాలా సందర్భాల్లో వినే ఉంటాం. చెన్నైకి చెందిన ఇద్దరు యువతులను ఇలాగే పిలవాలి. ఎందుకంటే ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటూ చదువుపై ఆసక్తితో డిగ్రీ పూర్తి చేశారు. అయితే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్న 50 కుటుంబాలను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారు. ఆ కుటుంబాల్లోని వ్యక్తులే ఈ ఇద్దరు యువుతులు. దీంతో వారి పరిస్థితి ఆ కాస్త ఫుట్‌పాత్‌ నుంచి రోడ్డుపైకి వచ్చింది. తమకు గూడు కావాలని, తమ వారి బతుకులకు నీడ కావాలని ఈ ఇద్దరు యువుతులు డిమాండ్ చేస్తున్నారు.


ఫుట్‌పాత్‌లపై నివాసం కఠినమైనది, సాహసోపేతమైనది. ఎన్నో సామాజిక అంశాలు బాధిస్తుంటాయి. మురుగు, దోమలు, శబ్దాలు, వైన్ షాపుల రద్దీ, కాలుష్యం వంటి అనేక సమస్యలను అధిగమించి చదువు కొనసాగించడం చాలా కష్టమన పనే అయినప్పటికీ రేపటి తమ భవిష్యత్‌కు చదువు మాత్రమే పరిష్కారం అనే సంకల్పంతో డిగ్రీ పూర్తి చేసినట్లు సుగన్య (21), రఫిషా ఏ (21) అనే ఆ యువతులు తెలిపారు. స్థానిక కర్పొరేషన్ పాఠశాల నుంచి 12వ తరగతి పూర్తి చేసి అనంతరం డిగ్రీ చదివిన వీరిద్దరు మాత్రమే ఆ 50 కుటుంబాల్లో చదువుకున్న వ్యక్తులు. నిలువ నీడ లేకుండా చదవడం చాలా కష్టమని, అందుకే 40 మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారని చెప్పుకొచ్చారు.


క్వీన్ మేరీ కాలేజీ నుంచి బీఎస్సీ టూరిజంలో సుగన్య డిగ్రీ తీసుకుంది. క్వీద్ ఎ మిల్లత్ కాలేజీ నుంచి బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసింది రఫిషా. 2019లో తన డిగ్ర పూర్తైందని ఆరు నెలల పాటు రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాల్లో టూరిస్ట్ గైడర్‌గా కూడా పని చేసినట్లు సుగన్య చెప్పుకొచ్చింది. డబ్బుల కోసం తామెప్పుడూ దిగులు చెందలేదని తమకు వచ్చే స్కాలర్‌షిప్‌లతో విద్య పూర్తి చేసినట్లు ఆమె పేర్కొంది. సుగన్యకు ఈ మధ్యే పెళ్లైంది. ఇక రఫియా ఎంఏ పూర్తి చేసి లెక్చరర్ అవ్వాలని చెప్పుకొచ్చింది. అయితే ఇన్నాళ్లు కనీసంగా ఉన్న ఫుట్‌పాత్ జీవితం కూడా ఇప్పుడు కోల్పోయామని, కనీస జీవనానికి తమకు భరోసా కావాలని ఇద్దరు యువతులు చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-10-23T01:00:46+05:30 IST