అధికారులూ అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2021-09-29T05:46:01+05:30 IST

ఒడిశా రాష్ట్రంలో కురిసిన వర్షాల నేపథ్యంలో నదుల్లోకి భారీగా నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, డీఐజీ ఎల్‌వీకే రంగారావు, ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశించారు. మంగళవారం వారు కొండ చాకరాపల్లి, గీతనాపల్లిలో పర్యటించారు.

అధికారులూ అప్రమత్తంగా ఉండండి
రిజర్వాయర్‌ వద్ద పరిస్థితిపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌


 జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

  డీఐజీ రంగారావు, ఎస్పీ  పరిశీలన

వంగర, సెప్టెంబరు 28: ఒడిశా రాష్ట్రంలో కురిసిన వర్షాల నేపథ్యంలో నదుల్లోకి భారీగా నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, డీఐజీ ఎల్‌వీకే రంగారావు, ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశించారు. మంగళవారం వారు కొండ చాకరాపల్లి, గీతనాపల్లిలో పర్యటించారు. వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొప్పర గ్రామంలో నీరుచేరింది. ఈ నేపథ్యంలో బాధిత ప్రజలకు భోజన ఏర్పాట్లు, మందులు, తాగునీరు అందించాలన్నారు. మడ్డువలస రిజర్వాయర్‌ను అధికారులతో కలిసి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. దెబ్బతిన్న పంటపొలాలను గుర్తించి నష్టపరిహారం అంచనా వేయాలని ఆదేశించారు. ఏటా చిన్నపాటి వర్షాలకు మా గ్రా మాలు మునిగిపోతున్నాయని ఆయాన గ్రామాల ప్రజలు కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో  వరద కట్టల నిర్మాణానికి రూ. 16 కోట్లతో ఆంచనాలు తయారు చేయాలని, భూ ములు కొనుగోలుకు మరో రూ.2 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చారు. గ్రామాల్లో వెంటనే నష్ట పరిహారం అంచనాలు తయారు చేయాలన్నారు. నాగావళిలో నీరు ఎక్కువగా రావడంతో పరీ వాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. సంగమేశ్వరస్వామి ఆలయంతో పాటు పలు గ్రామాల్లో నీరు చేరింది. బాధితులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ ఆర్డీవో కుమార్‌, డీఎస్పీ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. కొప్పర గ్రామంలో నీరు చేరడంతో పాఠశాలలోని విద్యార్థుల రికార్డులు గల్లంతయ్యాయి. వసతి గృహంలో నీరు చేరడం విలువైన వస్తువులు, పుస్తకాలు నీటిలో కలిసిపో యాయి. గీతనాపల్లిలో కార్యాలయాల్లో నీరుచేరింది. 

 

Updated Date - 2021-09-29T05:46:01+05:30 IST