అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-02-16T03:56:15+05:30 IST

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబీమా 9 మందికి మంజూరు కాగా మరొకరికి ఎందుకు మంజూరు కాలేదని, పెండింగ్‌లో ఎందుకు ఉంచు తున్నారని వ్యవసాయాధికారి సంగీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

జన్నారం, ఫిబ్రవరి 15: అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబీమా  9 మందికి మంజూరు కాగా మరొకరికి ఎందుకు మంజూరు కాలేదని, పెండింగ్‌లో ఎందుకు ఉంచు తున్నారని వ్యవసాయాధికారి సంగీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ఇరిగేషన్‌ అధికారుల పనితీరు సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇం టింటికి  మిషన్‌ భగీరథ  నీరు ఎందుకు అందించడం లేదని డీఈ వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్‌ స్తంభా లను వేయడంలో ఏఈ అలసత్వం వహి స్తున్నారని సర్పంచు, ఎంపీటీసీలు తెలు పగా ఫోన్‌లో ఎస్‌ఈతో మాట్లాడారు.  గోండుగూడకు చెందిన ఆదివాసీలకు గు స్సాడీ చెక్కులను అందించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీప తి బుచ్చయ్య, ఎంపీపీ సరోజన, ఎంపీడీవో అరుణరాణి, తహసీల్దార్‌ పుష్పలత, డీఈ వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ సుతారి వినయ్‌, కో ఆప్షన్‌ మున్వర్‌ ఆలీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-16T03:56:15+05:30 IST