Afghanistan: తాలిబాన్ వెబ్‌సైట్‌లు ఆఫ్‌లైన్

ABN , First Publish Date - 2021-08-21T15:29:14+05:30 IST

అధికారిక తాలిబాన్ వెబ్‌సైట్‌లు ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి.అఫ్ఘానిస్థాన్ దేశంలో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక...

Afghanistan: తాలిబాన్ వెబ్‌సైట్‌లు ఆఫ్‌లైన్

కారణం మాత్రం తెలియదు...

బోస్టన్: అధికారిక తాలిబాన్ వెబ్‌సైట్‌లు ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి.అఫ్ఘానిస్థాన్ దేశంలో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక పాష్టో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్, దారీ భాషల్లో ఉన్న వెబ్‌సైట్‌లు అకస్మాత్తుగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి. ఐదు భాషల్లో ఉన్న తాలిబాన్ వెబ్‌సైట్‌లు ఎందుకు ఆఫ్‌లైన్‌లో ఉన్నాయో తెలియ లేదు. శుక్రవారం ప్రముఖ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ పలు తాలిబాన్ గ్రూపులను తొలగించింది. తాలిబాన్ కొత్త హోస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నందున వారి వెబ్‌సైట్‌లు అదృశ్యం కావడం తాత్కాలికం కావచ్చునని కొందరు భావిస్తున్నారు. 


అయితే వాట్సాప్ మాత్రం గ్రూపులను తొలగించినట్లు నివేదించింది. అమెరికా మద్దతు ఉన్న అఫ్ఘాన్ ప్రభుత్వం తాలిబాన్ల చేతిలోకి పోవడంతో ఫేస్‌బుక్ తాలిబాన్ ఖాతాలను నిషేధించింది.కాట్జ్ ఇమెయిల్ ద్వారా తాలిబాన్ వెబ్‌సైట్‌లను తీసివేయడం వారి ఆన్‌లైన్ ఉనికిని తగ్గించడానికి మొదటి అడుగు మాత్రమే అని భావిస్తున్నారు.ఫేస్‌బుక్ లాగా గూగుల్ యొక్క యూట్యూబ్ తాలిబాన్‌ను తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంది.దీంతో తాలిబాన్ల ఖాతాలను ఆపరేట్ చేయడాన్ని యూట్యూబ్ నిషేధించింది.


Updated Date - 2021-08-21T15:29:14+05:30 IST