Abn logo
Sep 24 2021 @ 23:58PM

రూ. 14 లక్షల బాణసంచా స్వాధీనం

నిల్వ చేసిన బాణసంచాను పరిశీలిస్తున్న డీఎస్పీ

పెనుమంట్ర, సెప్టెంబరు 24 : మండలంలోని నెగ్గిపూడిలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణ సం చా గోదాముపై దాడి చేసి రూ. 14 లక్షల విలు వైన మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పెనుమంట్ర ఎస్‌ఐ వి. రమేష్‌ తెలిపా రు. ఇరగవరం మండలానికి చెందిన గుడిమెట్ల కృష్ణ సాయి మోహన్‌ రెడ్డి అనుమతులు లేకుం డా బాణసంచాను నిల్వ చేసినట్టుగా సమాచారం అందటంతో గురువారం రాత్రి నెగ్గిపూడి  అగ్రికల్చర్‌ ఫామ్‌ రోడ్డులోని గోదాముపై దాడిచేసి బాణసంచాను స్వాధీనం చేసుకుని, నిందితుడు సాయి మోహన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. డీఎస్పీ పి. వీరాంజనేయులు,  సీఐ జీవీవీ నాగేశ్వరరావు అభినందించారని తెలిపారు.