కరోనాను కట్టడి చేసేలా..

ABN , First Publish Date - 2021-04-18T05:36:54+05:30 IST

కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. జిల్లాలో శనివారం మరో 662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ఇప్పటివరకు 10,02,238 నమూనాలు సేకరిం చగా.. కరోనా బాధితుల సంఖ్య 51,171కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసో లేషన్‌ కేంద్రంలో 3,147 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 333 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 181 మంది చికిత్స పొం దుతున్నారు. శనివారం 123 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు చేసి.. కరోనాను కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారు.

కరోనాను కట్టడి చేసేలా..

 మరో 662 పాజిటివ్‌ కేసులు నమోదు 

 నిబంధనలు కఠినతరం చేసిన అధికారులు

 మాస్క్‌ వినియోగంపై స్పెషల్‌ డ్రైవ్‌

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. జిల్లాలో శనివారం మరో 662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ఇప్పటివరకు 10,02,238 నమూనాలు సేకరిం చగా..  కరోనా బాధితుల సంఖ్య 51,171కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసో లేషన్‌ కేంద్రంలో 3,147 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో  333  మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 181 మంది చికిత్స పొం దుతున్నారు. శనివారం 123 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు చేసి.. కరోనాను కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ అమిత్‌ బర్దర్‌ సైతం జిల్లా యంత్రాంగానికి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మాస్క్‌ తప్పనిసరి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం కొవిడ్‌ నిబంధనలు పాటించని వారికి జరిమానా, జైలు శిక్ష విధించేందుకు సన్నద్ధమవుతున్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌ వినియో గించాలని ఆదేశిస్తున్నారు. మాస్క్‌ల వినియో గంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.  శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో మాస్క్‌ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. 

మరోవైపు  జిల్లాలో కొవిడ్‌ నియంత్రణలో భాగంగా నోడల్‌ అధికారులను నియమించారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జన సంచారం, రద్దీ ఎక్కువగా ఉండే శ్రీకాకుళం పెద్ద బజారును 80 ఫీట్‌ రోడ్‌కు తరలించారు. రంజాన్‌ ప్రార్థనలు, శ్రీరామనవమి వేడుకలను కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించేలా చర్యలు చేపడుతు న్నారు. ఆదివారం నుంచి శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్‌ రోడ్డుకు ప్రధాన మార్కెట్లు తరలించనున్నారు. ముత్యాలమ్మ హోల్‌సేల్‌ మార్కెట్‌ను కోడి రామ్మూర్తి స్టేడియా నికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.


 కొవిడ్‌ నోడల్‌ అధికారుల నియామకం

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 17: జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు నోడల్‌ అధికారులను నియమిస్తూ  కలెక్టర్‌ నివాస్‌ శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, నమూనాల సేకరణ విభాగానికి జిల్లా అటవీశాఖాధికారి సందీప్‌ కృపాకర్‌, ల్యాబ్‌ టెస్టింగ్‌ విభాగానికి ఐటీడీఏ పీవో సీహెచ్‌.శ్రీధర్‌ను నియమించారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు, కంటైన్మెంట్‌ మేనేజ్‌ మెంట్‌కు ఏడీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు, హోమ్‌క్వారం టైన్‌కు వైద్యాధికారి జె.కృష్ణమోహన్‌, డేయేజింగ్‌కు జిల్లా శిక్షణ కేంద్రం పీవో రవికుమార్‌, హోమ్‌ ఐసోలేషన్‌కు ఐసీడీ ఎస్‌ పీడీ జి.జయదేవి, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు ఎస్టీసీ కె.సీతా రామమూర్తి, ఆసుపత్రుల హెల్ప్‌డెస్క్‌కు ఎస్టీసీ బి.శాంతిని  నోడల్‌ అధికారులుగా నియమించారు. ఆక్సిజన్‌ మేనేజ్‌మెం ట్‌కు జేసీ ఆర్‌.శ్రీరాములు నాయుడు, మెడిసిన్‌ మేనేజ్‌ మెంట్‌కు డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ సీహెచ్‌ నాగకిరణ్‌ కుమార్‌, మెడికల్‌ సెసెన్షియల్‌కు డిప్యూటీ కలెక్టర్‌ పి.శేష శైలజ, 104 కాల్‌ సెంటర్‌కు సీపీవో ఎం.మోహన్‌రావు, అబు లెన్స్‌(108) లకు జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, మృతదేహాల మేనేజ్‌మెంట్‌కు ఆర్డీవో ఐ.కిషోర్‌, సిబ్బంది నిర్వహణకు డ్వామా పీడీ కూర్మా రావులు నోడల్‌ అధికారులుగా నియమితులయ్యారు.


 80 అడుగుల రోడ్డుకు పెద్దబజారు తరలింపు

 గుజరాతీపేట: శ్రీకాకుళం నగరంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పొట్టి శ్రీరా ములు మార్కెట్‌ను నగరంలోని 80 అడుగుల రహదారి వద్దకు తరలించినట్టు కలెక్టర్‌ నివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తోపుడు బండ్ల వ్యాపారాలను కూడా అక్కడకే మార్పు చేసినట్టు చెప్పారు.  ఆదివారం నుంచి  అక్కడే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, తదితర విక్రయాలు జరుగుతాయని తెలిపారు. వినియోగదారులు, వ్యాపారస్తులు తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - 2021-04-18T05:36:54+05:30 IST