అటవీ శాఖ నర్సరీని సందర్శించిన తమిళనాడు ఐఎఫ్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-04-09T05:16:11+05:30 IST

బూర్గంపాడు మండల పరిధిలోని సందెళ్లపాడు అటవీశాఖ నర్సరీని గురువారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పారెస్టు(ఐఎఫ్‌ఎస్‌) అధికారి హేమంత్‌కుమార్‌ సందర్శించారు.

అటవీ శాఖ నర్సరీని సందర్శించిన తమిళనాడు ఐఎఫ్‌ఎస్‌
మొక్కలను పరిశీలిస్తున్న తమిళనాడు ఐఎఫ్‌ఎస్‌ అధికారి

బూర్గంపాడు, ఏప్రిల్‌ 8: బూర్గంపాడు మండల పరిధిలోని సందెళ్లపాడు అటవీశాఖ నర్సరీని గురువారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పారెస్టు(ఐఎఫ్‌ఎస్‌) అధికారి హేమంత్‌కుమార్‌ సందర్శించారు. ఈ సందర్బంగా నర్సరీలో పెంచుతున్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలోని పలు రకాల మొక్కలను పరిశీలించి సిబ్బందిని ఆభినందించారు. నర్సరీ సందర్శనలో భాగంగా తమ సెల్‌ఫోన్‌లో మొక్కల పెంపకం ఫొటోలను తీసుకున్నారు. అనంతరం కొత్తగా ఎంపికైన ఎఫ్‌బీవోలకు నర్సరీ పెంపకం పట్ల ఆవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సీఎఫ్‌ భీమా, డీఎఫ్‌వో లక్ష్మణ్‌రంజిత్‌నాయక్‌, ఎఫ్‌డీవో వేణుబాబు, ఎఫ్‌ఆర్‌వో భారతి, డీఆర్‌వో సుజాత, ఎఫ్‌ఆర్‌వో భీంచందర్‌ పాల్గొన్నారు.

అశ్వాపురం రేంజ్‌లో పర్యటించిన ఐఎఫ్‌ఎస్‌

అశ్వాపురం ఏప్రిల్‌ 8: అశ్వాపురం అటవీ రేంజ్‌ పరిధిలో బూర్గంపాడు అశ్వాపురం మండలాలలో తమిళనాడు ఐఎఫ్‌ఎస్‌ హేమంత్‌ కుమార్‌ గురువారం పర్యటిచారు. ఈ సందర్బంగా సందెళ్లపాడు నర్సరీతో పాటు కృష్ణసాగర్‌ అటవీ ప్రాంతంలోని సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన ఎకోబ్రిడ్జ్‌ల నిర్మాణాలను పరిశీలించారు. నర్సరీ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ కన్జర్వరేటర్‌ భీమా నాయక్‌, డీఎఫ్‌వో లక్ష్మణ్‌ నాయక్‌, ఎఫ్‌డీవో వేణుబాబు,  అశ్వాపు రం రేంజర్‌ భారతి, ఇరవెండి సెక్షన్‌ అధికారి నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-09T05:16:11+05:30 IST