వీడసలు తండ్రేనా.. కొడుకును రూంలో నగ్నంగా బంధించి.. ఆపై ప్రియురాలితో కలిసి..

ABN , First Publish Date - 2021-09-12T11:56:06+05:30 IST

నాన్న.. అనే పదాన్ని ఎంత వర్ణించినా తక్కువే. నవమాసాలు మోసి అమ్మ జన్మనిస్తే.. మిగిలిన జీవితాన్ని నాన్న వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తాడు. నాన్న అండగా ఉంటే.. ఎంతటి ఆపదనైనా అవలీలగా ఎదుర్కోగలం అనే నమ్మకం పిల్లల్లో ఉంటుంది. అయితే.. ఓ కొడుకు విషయంలో తండ్రి మానవమృ

వీడసలు తండ్రేనా.. కొడుకును రూంలో నగ్నంగా బంధించి.. ఆపై ప్రియురాలితో కలిసి..

ఎన్నారై డెస్క్: నాన్న.. అనే పదాన్ని ఎంత వర్ణించినా తక్కువే. నవమాసాలు మోసి అమ్మ జన్మనిస్తే.. మిగిలిన జీవితాన్ని నాన్న వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తాడు. నాన్న అండగా ఉంటే.. ఎంతటి ఆపదనైనా అవలీలగా ఎదుర్కోగలం అనే నమ్మకం పిల్లల్లో ఉంటుంది. అయితే.. ఓ కొడుకు విషయంలో తండ్రి మానవమృగంలా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కాలయముడయ్యాడు. ఆపదలో అండగా నిలవాల్సిన వాడే.. కొడుకుపై దారుణానికి పాల్పడ్డాడు. ఏళ్ల తరబడి.. అత్యాచారం చేసి.. అతి దారుణంగా హతమార్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 


అగ్రరాజ్యం అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన అల్ ముతాహాన్ మెక్లీన్ (32).. ప్రియురాలితో కలిసి తన 10ఏళ్ల కొడుకుపట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ప్రాసిక్యూటర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్ ముతాహాన్ మెక్లీన్.. తన కొడుకు టకోడా కాలిన్స్‌పట్ల 2015 నుంచి దారుణంగా ప్రవర్తించేవాడు. శారీరంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచూస్తూ ఉండేవాడు. నగ్నంగా ఓ రూంలో బంధించి.. అతనిపై అత్యాచారం చేయడంతోపాటు గొడ్డునుబాదినంటు బాదేవాడు. ఈ క్రమంలో 2019 డిసెంబర్‌ 13న టకోడా కాలిన్స్.. ప్రాణాలు కోల్పోయాడు. అయితే కొడుకు ప్రాణాలు కోల్పోయాడు అనే విషయాన్ని గ్రహించని అల్ ముతాహాన్ మెక్లీన్.. పోలీసులకు సమాచారం అందించాడు. తన కొడుకు ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడంటూ పేర్కొన్నాడు. 



దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడి శవానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు.. సంచలన విషయాలు వెల్లడించాడు. బాలుడిపై అత్యాచారం జరిగినట్టు చెప్పడంతోపాటు.. దెబ్బలతకు తట్టుకోలేకే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. దీంతో పోలీసులు అల్ ముతాహాన్ మెక్లీన్‌తో పాటు అతని ప్రియురాలు అమండా హింజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. సాక్ష్యాధారాలను పరిశీలించి అల్ ముతాహాన్ మెక్లీన్‌‌, అమండా హింజ్‌ను దోషులుగా తేల్చింది. ఈ క్రమంలో అల్ ముతాహాన్ మెక్లీన్ కూడా తాను చేసిన తప్పును కోర్టులో ఒప్పుకున్నాడు. 


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రాసిక్యూటర్.. అల్ ముతాహాన్ మెక్లీన్‌కు 40ఏళ్ల జైలు శిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా అతని ప్రియురాలికి 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో అమండా హింజ్ సోదరి జెన్నీఫర్ ఎబెర్ట్ కూడా దోషిగా తేలినట్లు పేర్కొన్నారు. కొడుకు పట్ల అల్ ముతాహాన్ మెక్లీన్.. మానవ మృగంలా ప్రవర్తిండాని అసహనం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-09-12T11:56:06+05:30 IST