ఫేస్‌ ఆయిల్స్‌తో ముఖానికి మెరుపు

ABN , First Publish Date - 2021-12-06T05:30:00+05:30 IST

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో చర్మ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఏ నూనె ఎవరికి ఉపయోగమో......

ఫేస్‌ ఆయిల్స్‌తో ముఖానికి మెరుపు

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో చర్మ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఏ నూనె ఎవరికి ఉపయోగమో, ఏ చర్మానికి ఏ నూనె ప్రయోజనకరమో తెలుసుకుందాం!


గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌

 చర్మ తత్వం: జిడ్డు చర్మం, మిశ్రమ చర్మం, సున్నిత చర్మం, వయసు పైబడే చర్మం

 ప్రయోజనాలు: నల్లని వలయాలు చర్మంలో కలిసిపోవడానికి తోడ్పడుతుంది. 

 ఇలా వాడాలి: రాత్రి నిద్రకు ముందు ముఖం మీద పలుచగా పూసుకోవాలి.


ఆముదం

 చర్మ తత్వం: పొడి చర్మం, వయసు పైబడే చర్మం.

 ప్రయోజనాలు: స్ర్టెచ్‌ మార్క్స్‌ తొలగిపోతాయి. పొడి పెదవులు మృదువుగా తయారవుతాయి. ముడతలు తగ్గుతాయి.

 ఇలా వాడాలి: రాత్రి నిద్రకు ముందు శుభ్రమైన చర్మం మీద పూసుకోవాలి.


రోజ్‌హిప్‌ ఆయిల్‌

  చర్మ తత్వం: జిడ్డు చర్మం, మిశ్రమ చర్మం, సున్నిత చర్మం, వయసు పైబడే చర్మం.

 ప్రయోజనాలు: పిగ్మెంటేషన్‌ తగ్గుతుంది. మచ్చలు తగ్గుతాయి. డ్యామేజ్‌ అయిన చర్మం బాగవుతుంది. చర్మం మీద గీతలు తగ్గుతాయి.

 ఇలా వాడాలి: ప్రతి రోజూ మాయిశ్చరైజర్‌తో పాటు రెండు చుక్కల రోజ్‌హిప్‌ ఆయిల్‌ వాడుకుంటే చర్మానికి అదనపు మెరుపు, మృదుత్వం దక్కుతుంది.


జొజోబా ఆయిల్‌

 చర్మ తత్వం: అన్ని చర్మ తత్వాలకూ ఉత్తమం.

 ప్రయోజనాలు: చర్మపు రంధ్రాలు తగ్గుతాయి. చర్మం జీవం పోసుకుంటుంది.

 ఇలా వాడాలి: రెండు మూడు చుక్కల జొజోబా ఆయిల్‌ను సహజసిద్ధ మేకప్‌ రిమూవర్‌గా వాడుకోవాలి.


నీమ్‌ ఆయిల్‌

 చర్మ తత్వం: పొడి చర్మం, మిశ్రమ చర్మం, జిడ్డు చర్మం

 ప్రయోజనాలు: ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతుంది. చర్మానికి రక్షణ అందిస్తుంది. వయసు పైబడే చర్మానికి పోషకాలను అందిస్తుంది.

 ఇలా వాడాలి: రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను నీమ్‌ ఆయిల్‌కు జోడించి, రాత్రి నిద్రకు ముందు ముఖానికి పూసుకోవాలి.


ఆర్గాన్‌ ఆయిల్‌

 చర్మ తత్వం: జిడ్డు చర్మం, మిశ్రమ చర్మం, సున్నిత చర్మం, వయసు పైబడే చర్మం

 ప్రయోజనాలు: చర్మం చిట్లడం ఆగుతుంది. పెదవుల పగుళ్లు తగ్గుతాయి. స్ట్రెచ్‌ మార్క్స్‌ తగ్గుతాయి.

 ఇలా వాడాలి: ముఖాన్ని ఈ నూనెతో మర్దన చేయాలి.

Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST