Abn logo
May 23 2020 @ 23:50PM

తమిళనాట టీవీ షూటింగులకు ఓకే

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, పరిమిత బృందంతో షూటింగులు చేసుకోవడానికి టీవీ పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భౌతిక దూరం, పరిశుభ్రత ప్రామాణాలు పాటించడం సహా సెట్‌లో 20మందికి మించరాదని, ఆరుబయట కాకుండా ఇండోర్స్‌లోనే చిత్రీకరణలు చేయాలని నిబంధనలు విధించింది. దక్షిణ భారత టెలివిజన్‌ నిర్మాతల సంఘం కార్యదర్శి, నటి ఖుష్బూ సుందర్‌ మాట్లాడుతూ ‘‘అనుమతి లభించినప్పటికీ ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కేవలం 20మందితో చిత్రీకరణ చేయడం సవాలే. ప్రతి శాఖకు ముగ్గురు నలుగురు అవసరమవుతారు. ఫెఫ్సీ (దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సమాఖ్య), ఆర్టిస్టులు, టీవీ నిర్మాతలతో కూర్చుని ఎలా చేయాలనేది చర్చించాలి’’ అన్నారు. రాధికా శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘సెట్‌లో శుభ్రత, శానిటైజేషన్‌ విషయంలో కఠినంగా ఉండాలి. ఇంటి దగ్గరే ఆర్టిస్టులు మేకప్‌ అయి సెట్‌కి ఒక్క అసిస్టెంట్‌తో వస్తే బావుంటుంది. ప్రొడక్షన్‌ ఫుడ్‌ కాకుండా ఇంటి నుంచి తెచ్చుకుంటే మంచిది’’ అని సూచించారు.

Advertisement
Advertisement
Advertisement