అమెరికాలో దారుణం..ఆశీర్వాదం కోసం వస్తే.. ఉమ్మిని మొహమంతా పులిమి..

ABN , First Publish Date - 2022-01-18T01:36:07+05:30 IST

దేవుడి సాక్షాత్కారం పొందే క్రమంలో ఒక్కోసారి కష్టాలను ఎదుర్కోవాలి..ఇదీ అమెరికాలోని ఓ పాస్టర్ చెప్పిన వాక్యం. ఆ పాస్టర్ ఎదురుగా ఉన్నది ఓ భక్తుడు. దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాడు. అయితే.. ఇలా అన్న వెంటనే ఆ పాస్టర్..పెద్దగా దగ్గి తన చేతిలో ఉమ్మేసుకున్నాడు. ఆ తరువాత..

అమెరికాలో దారుణం..ఆశీర్వాదం కోసం వస్తే.. ఉమ్మిని మొహమంతా పులిమి..

ఇంటర్నెట్ డెస్క్: దేవుడి సాక్షాత్కారం పొందే క్రమంలో ఒక్కోసారి కష్టాలను ఎదుర్కోవాలి..ఇదీ అమెరికాలోని ఓ పాస్టర్ చెప్పిన వాక్యం. ఆ పాస్టర్ ఎదురుగా ఉన్నది ఓ భక్తుడు. దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాడు. అయితే.. ఇలా అన్న వెంటనే ఆ పాస్టర్..పెద్దగా దగ్గి తన చేతిలో ఉమ్మేసుకున్నాడు. ఆ తరువాత.. దాన్ని ఎదురుగా ఉన్న వ్యక్తి మొహమంతా పులిమేశాడు. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో ఇటీవల జరిగిందీ ఘటన! ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఇలాంటి వికృతానికి తెగబడ్డ పాస్టర్ మైఖేల్ టాడ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఒమైక్రాన్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో చేసేది ఇదేనా’’ అంటూ స్థానికులు, నెటిజన్లు మైఖేల్‌పై మండిపడుతున్నారు. కాగా.. టూల్సా ప్రాంతంలోని ఓ ట్రాన్సఫర్మేషన్ చర్చ్‌లో మైఖేల్ టాడ్ పాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 

Updated Date - 2022-01-18T01:36:07+05:30 IST